సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By Kumar
Last Modified: మంగళవారం, 2 జనవరి 2018 (12:49 IST)

'గాడిద అందం' కోసం చైనా కష్టాలు... విదేశాలకు ఆఫర్లు...

ఏ ఉత్పత్తి అయినా తన దేశ అవసరాలకే కాకుండా ప్రపంచదేశాల అవసరాలను కూడా తీర్చగలిగే ఘనత చైనా సొంతం. కానీ ఇప్పుడు ఆ చైనాకు కూడా ఓ వస్తువు విషయంలో తీవ్రమైన కొరత ఏర్పడింది. అదే గాడిద చర్మం. స్వదేశంలో గాడిద చర్మానికి డిమాండ్ ఎక్కువై సప్లై తగ్గిపోవడంతో, చైనాకు

ఏ ఉత్పత్తి అయినా తన దేశ అవసరాలకే కాకుండా ప్రపంచదేశాల అవసరాలను కూడా తీర్చగలిగే ఘనత చైనా సొంతం. కానీ ఇప్పుడు ఆ చైనాకు కూడా ఓ వస్తువు విషయంలో తీవ్రమైన కొరత ఏర్పడింది. అదే గాడిద చర్మం. స్వదేశంలో గాడిద చర్మానికి డిమాండ్ ఎక్కువై సప్లై తగ్గిపోవడంతో, చైనాకు గాడిద కష్టాలు మొదలయ్యాయి.
 
దీని కోసం ఇతర దేశాల నుండి గాడిద చర్మాన్ని దిగుమతి చేసుకోవడానికి ఆ దేశ ప్రభుత్వం దిగుమతి సుంకాన్ని 5 శాతం నుండి 2 శాతానికి తగ్గించింది. ప్రస్తుతం చైనా మార్కెట్‌లో గాడిద తోలు ధర 30 వేల రూపాయలు (3 వేల యువాన్‌లు) పలుకుతోంది.
 
ఇంతకీ ఈ గాడిద తోలుతో ఏమి చేస్తారు?
గాడిద తోలు నుండి తీసే జెలిటిన్ అనే పదార్థాన్ని చైనా సాంప్రదాయ సౌందర్య సాధనాల్లో విరివిగా ఉపయోగిస్తారు. దీని కోసం ఏటా కొన్ని వందల కోట్ల డాలర్ల వ్యాపారం జరుగుతుందని అంచనా. ఇదే కాకుండా చైనాలో గాడిద మాంసానికి డిమాండ్ కూడా కాస్త ఎక్కువే. చైనాలో దీనికి డిమాండ్ ఎక్కువ కావడంతో రవాణా, వ్యవసాయ అవసరాల కోసం ఉపయోగించే గాడిదలను దొంగిలించి చైనాకు ఎగుమతి చేయడం ఊపందుకోవచ్చని ఇతర దేశాల ప్రభుత్వాలు ఆందోళన చెందుతున్నాయి.