శుక్రవారం, 24 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By selvi
Last Updated : మంగళవారం, 19 డిశెంబరు 2017 (18:34 IST)

అర్జున్ రెడ్డికి బాలీవుడ్ నుంచి పిలుపు.. ఏకంగా మూడు సినిమాలు?

ఎవడే సుబ్రహ్మణ్యం, పెళ్లిచూపులు సినిమాల ద్వారా మంచి గుర్తింపు సంపాదించిన హీరో విజయ్ దేవరకొండ.. అర్జున్ రెడ్డి సినిమాతో క్రేజ్‌ను పెంచుకున్నాడు. ఆపై విజయ్ దేవరకొండకు అవకాశాలు క్యూకట్టాయి. ప్రస్తుతానికి

ఎవడే సుబ్రహ్మణ్యం, పెళ్లిచూపులు సినిమాల ద్వారా మంచి గుర్తింపు సంపాదించిన హీరో విజయ్ దేవరకొండ.. అర్జున్ రెడ్డి సినిమాతో క్రేజ్‌ను పెంచుకున్నాడు. ఆపై విజయ్ దేవరకొండకు అవకాశాలు క్యూకట్టాయి. ప్రస్తుతానికి అర్జున్ రెడ్డి చేతిలో అరడజనుకు మించిన ప్రాజెక్టులు వున్నాయి. అలనాటి నటి సావిత్రి జీవిత కథ ఆధారంగా తెరకెక్కే ''మహానటి''లో అర్జున్ రెడ్డి ఓ ఓ జర్నలిస్ట్ రోల్‌లో కనిపిస్తున్నాడు. 
 
ఈ నేపథ్యంలో అర్జున్ రెడ్డికి బాలీవుడ్ నుంచి పిలుపు వచ్చిందని ఫిలిమ్ నగర్ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది. బాలీవుడ్‌లో భారీ నిర్మాణ సంస్థల్లో ఒక్కటైన యష్ రాజ్ ఫిలిమ్స్ వారు విజయ్ దేవరకొండతో మూడు సినిమాలు చేసేందుకు ఒప్పందం కుదుర్చుకోమన్నారట. అయితే ఈ ఆఫర్‌ను విజయ్ దేవరకొండ సున్నితంగా తిరస్కరించినట్లు తెలుస్తోంది. ఈ డీల్‌పై విజయ్ దేవరకొండ పెద్దగా ఆసక్తి చూపలేదని సమాచారం.