సంబంధిత వార్తలు
- Washing Hands in Plate? భోజనం చేసిన తర్వాత కంచంలోనే చేతులు కడిగేస్తున్నారా?
- ఆర్బీఐ వద్ద రూ.2 వేల నోట్లు ఎన్ని ఉన్నాయో తెలుసా?
- వంశీకి ఆయుష్‌లో ముగిసిన చికిత్స - ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్
- హైదరాబాద్‌కి చెందిన ఐదుగురు ఆకాష్ విద్యార్థులకి JEE అడ్వాన్స్డ్ 2025లో టాప్ స్కోరర్స్
- పవన్ కళ్యాణ్ సినిమాకు టిక్కెట్ రేట్లు పెంచండి... ఏఎం రత్నం వినతి
Okra Water: బెండకాయలు నానబెట్టిన నీరు చాలు.. హెయిర్ ఫాల్‌కు గుడ్ బై.. ఎలా?
Okra Water
బెండకాయలను నానబెట్టినప్పుడు నీటిలో కాస్త జెల్ ఏర్పడుతుంది. ఈ జెల్ లాంటి పదార్థం జుట్టు రాలడాన్ని, జుట్టు నెరవడానికి చెక్ పెడుతుంది. ఈ బెండకాయ నీటిలో పరగడుపున ఉదయం పూట తీసుకోవడం ద్వారా జుట్టు పెరుగుతుంది. డయాబెటిస్ దరిచేరదు.
ఇందులోని యాంటీయాక్సిడెంట్లు జుట్టు కుదుళ్లకు బలాన్ని ఇస్తాయి. ఇంకా జుట్టు పెరుగుదలకు ఇందులోని ఏ, సీ, కె, ఇనుము, ఫోలెట్ వంటి విటమిన్లు తోడ్పడతాయి. బెండకాయలు నానబెట్టిన నీరు జుట్టుకు సహజసిద్ధ కండిషనర్‌గా పనిచేస్తుంది. చుండ్రును దూరం చేస్తుంది. జుట్టును మెరిసేలా చేస్తుంది.
శుభ్రపరిచిన 10 బెండకాయలను చిన్నపాటి ముక్కలుగా కట్ చేసుకుని రెండు గ్లాసుల నీరు చేర్చి కప్పులో నానబెట్టుకోవాలి. దీనిని రాత్రంతా నానబెట్టి, ఉదయం పూట ఆ నీటిని తాగడం లేదా.. ఆ నీటిని జుట్టుకు పట్టించి బాగా మసాజ్ చేయాలి.
20 నిమిషాల తర్వాత నీటితో శుభ్రం చేసుకుంటే సరిపోతుంది. ఇలా వారానికి రెండు లేదా 3సార్లు బెండకాయలు నానబెట్టిన నీటిని కుదుళ్లకు పట్టించడం ద్వారా మెరిసే జుట్టు మీ సొంతం అవుతుంది.
తర్వాతి కథనం
