1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
  4. RBI data: Rs 2000 notes worth Rs 6,266 cr still in circulation after withdrawal 2 yrs ago

ఆర్బీఐ వద్ద రూ.2 వేల నోట్లు ఎన్ని ఉన్నాయో తెలుసా?

currency
దేశంలో చెలామణిలో ఉన్న రూ.2 వేల నోట్లను భారత రిజర్వు బ్యాంకు ఉపసంహరించుకుంది. ఈ నోట్లలో పూర్తి స్థాయిలో ఆర్బీఐకు చేరలేదు. ఆర్థిక వ్యవస్థలో ఇప్పటికీ వేల కోట్ల రూపాయల విలువైన రూ.2 వేల కరెన్సీ నోట్లు ఉన్నాయని ఆర్బీఐ తాజాగా వెల్లడించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆదేశాల మేరకు గత 2023 మే 19వ తేదీన ఈ నోట్ల ఉపసంహరణ ప్రకటన వెలువడిన విషయం తెల్సిందే. ఈ నోట్లను మార్చుకునేందుకు బ్యాంకులతో పాటు పోస్టాఫీసుల్లో కూడా మార్చుకునే వెసులుబాటు కల్పించింది. 
 
ఇదిలావుండగా, ఆర్బీఐ తాజాగా విడుదల చేసిన గణాంకాల ప్రకారం 2025 మే 31వ తేదీ నాటికి రూ.6,181 కోట్ల విలువైన రూ.2 వేల నోట్లు ప్రజల వద్ద ఉన్నాయని తేలింది. 2023 మే 19వ తేదీ నాటికి రూ.2 వేల నోట్లను చలామణి నుంచి ఉపసంహరించుకుంటున్నట్టు ఆర్బీఐ ప్రకటించిన విషయం తెల్సిందే. ఆ నాటికి చలామణిలో ఉన్న రూ.2 వేల నోట్లలో ఇప్పటికే 98.26 శాతం తమ వద్దకు తిరిగి వచ్చాయని ఆర్బీఐ తెలిపింది. 
తర్వాతి కథనం
వంశీకి ఆయుష్‌లో ముగిసిన చికిత్స - ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్