1. ఇతరాలు
  2. మహిళ
  3. సౌందర్యం
  4. For beauty skin, apply mild warm coconut oil

స్నానానికి ముందు గోరువెచ్చని కొబ్బరి నూనె రాసుకుంటే....?

భుజాలు, కాళ్లపైన చర్మం వాతావరణ మార్పు వల్ల నలుపుగా మారుతుంది. దీనికి కొబ్బరి నూనె లేదా బాదం నూనె చర్మాన్నిమృదువుగా మార్చడమే కాకుండా నల్లని చర్మం నుండి విముక్తి కలిగిస్తుంది. కొబ్బరి నూనె, కొంచెం నిమ్మరసం కలిపి మోచేతులు, మోకాళ్లపై రాసి మర్ధన చేసుకోవాల

beauty skin
భుజాలు, కాళ్లపైన చర్మం వాతావరణ మార్పు వల్ల నలుపుగా మారుతుంది. దీనికి కొబ్బరి నూనె లేదా బాదం నూనె చర్మాన్నిమృదువుగా మార్చడమే కాకుండా నల్లని చర్మం నుండి విముక్తి కలిగిస్తుంది. కొబ్బరి నూనె, కొంచెం నిమ్మరసం కలిపి మోచేతులు, మోకాళ్లపై రాసి మర్ధన చేసుకోవాలి. రోజూ స్నానానికి ముందు నిమ్మరసం రాసి, ఐదు నిమిషాలు తర్వాత శనగపిండితో కడిగితే నలుపు రంగు క్రమంగా తగ్గుతూ వస్తుంది. 
 
టమోటో రసం లేదా దానిమ్మ రసం తేనె కలిపి మోకాళ్లకు, మోచేతులకు రాసి, శుభ్రపరుచుకుంటే నలుపు సులువుగా తగ్గుతుంది. నువ్వుల నూనెలో చర్మాన్ని మృదువుగా ఉంచే సుగుణాలు పుష్కలంగా ఉన్నాయి. వారానికి ఒకసారి నలుగు పిండిలో నువ్వుల నూనె కలిపి వల్ల చర్మానికి పట్టిస్తే కావల్సిన ఫ్యాటీ యాసిడ్స్ లభించి, మృదువుగా కోమలంగా మారుతుంది. రెండు టీ స్పూన్ల ఆలివ్ ఆయిల్, పంచదార కలిపి మోకాళ్లకు, మోచేతులకు రాసి, రుద్దాలి. ఇలా చేయడం వల్ల నలుపు తగ్గుతుంది.
 
పెరుగులో కొద్దిగా నిమ్మరసం, శెనగపిండి కలిపి నలుపుగా ఉన్నచోట రాసి, గోరు వెచ్చని నీటితో కడిగితే చర్మానికి నిగారింపు వస్తుంది. పాల మీగడలో చిటికెడు పసుపు రాసి, నలుపుగా ఉన్న చోట రాసి, రుద్ది, శుభ్రపరచాలి. రోజూ స్నానానికి ముందు గోరువెచ్చని కొబ్బరి నూనె రాసుకుంటే చర్మం మృదువుగా మారుతుంది. నారింజ తొక్కలను ఎండబెట్టి పౌడర్ చేసుకోవాలి. ఈ పౌడర్‌లో కొద్దిగా పెసరపిండి కలిపి పేస్ట్‌లా చేసుకుని నల్లంగా ఉన్నచర్మంపై పూతలా పూయాలి. అరగంట తర్వాత చన్నీటితో శుభ్రం చేసుకుంటే నలుపు రంగు తగ్గుతూ వస్తుంది.
About Writer
ivr
Possessing over 27 years of experience in journalism, the author has served as an Assistant Scriptwriter and Researcher for the electronic Media ETV and ETV2, as well as a Sub-Editor for the magazines Swathi Sapariwara patrika and Sunday Indian. In addition to these roles, the author has contributed short stories.... మరింత చదవండి
తర్వాతి కథనం
రోజుకు ఓ కప్పు కొబ్బరి పాలు తీసుకుంటే...?