1. ఇతరాలు
  2. మహిళ
  3. సౌందర్యం
  4. hair beauty care tips for women's

జుట్టు ఊడిపోతుందా... ఈ చిట్కాలు పాటిస్తే....

జుట్టు పెరడానికి ఒక కప్పు పొన్నగంటి కూర అందులో గోరింటాకు పొడి, మెంతిపొడి, అరకప్పు పెరుగు, స్పూన్ నిమ్మరసం, నీళ్లు పోసి పేస్టులా తయారుచేసుకోవాలి. ఆ మిశ్రమాన్ని తలకు బాగా పట్టించాలి. 20 నిమిషాల తరువాత త

hair
జుట్టు పెరడానికి ఒక కప్పు పొన్నగంటి కూర అందులో గోరింటాకు పొడి, మెంతిపొడి, అరకప్పు పెరుగు, స్పూన్ నిమ్మరసం, నీళ్లు పోసి పేస్టులా తయారుచేసుకోవాలి. ఆ మిశ్రమాన్ని తలకు బాగా పట్టించాలి. 20 నిమిషాల తరువాత తలస్నానం చేయాలి. ఇలా వారానికి ఒకసారి చేస్తే జుట్టు బాగా పెరుగుతుంది. అలాగే రోజుకో ఆకుకూర తీసుకోవాలి.
 
అవి శరీరాన్నే కాదు జుట్టును కూడా ఆరోగ్యంగా ఉంచుతాయి. జుట్టురాలడం, చుండ్రు వంటి సమస్యలను దూరం చేస్తాయి. ఇంకా కొద్దిగా మజ్జిగలో చింత చిగురు, కప్పు గోరింటాకు పొడి, అరకప్పు శనగపిండి వేసి కలుపుకోవాలి. తలకు బాగా నూనెను రాసుకున్న తరువాత ఆ మిశ్రమాన్ని తలకు పట్టించాలి. 20 నిమిషాల తరువాత తలస్నానం చేయాలి. 
 
ఇలా చేయడం వలన జుట్టుకు మంచి కండిషనర్‌గా పనిచేస్తుంది. గోరింటాకు పొడిలో రెండు స్పూన్స్ ముల్తానీ మట్టి, కప్పు పెరుగు వేసి పేస్టులా తయారుచేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని తలకు పట్టించి 30 నిమిషాల తరువాత స్నానం చేస్తే జుట్టు నిగనిగలాడుతుంది.
About Writer
Kowsalya
దేవీ (మురళీకృష్ణ)  నిక్‌నేమ్- శక్తిమాన్ సినిమా రంగంలో దాదాపు 26 ఏళ్ల అనుభవం ఉంది. కళారంగంపై ఇంట్రెస్టుతో రిపోర్టర్‌గా కెరీర్ మొదలైంది. అలా చేస్తూనే విజయవాడలో రంగస్థలంపై నాటకాల్లో పాత్రలు పోషించారు. అలా ఆర్టిస్టుగా.. పలు సినిమాలు, సీరియల్స్‌లో సైతం నటించారు. స్క్రిప్ట్ వర్క్‌లో కూడా కొద్దికాలం చేశారు. అలా ప్రజాశక్తి దినపత్రికలో సినిమా పేజీ న్యూస్ రిపోర్టర్‌గా తనతోనే ఆరంభం అయింది. అలా చేస్తుండగానే మెగాస్టార్ చిరంజీవి గారితో ఇంటర్వ్యూ చేశాక...... మరింత చదవండి
తర్వాతి కథనం
బార్లీ గింజలతో ఫేస్ ప్యాక్ వేసుకుంటే...