1. ఇతరాలు
  2. మహిళ
  3. సౌందర్యం
  4. Health Benefits of Olive Oil

అందం, ఆరోగ్యానికి ఆలివ్ ఆయిల్ ఎలా ఉపయోగపడుతుంది?

Health Benefits of Olive Oil
ఆలివ్ ఆయిల్. పచ్చి ఆలివ్ నూనె చాలా ఆరోగ్యకరమైనది. దాని శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్ల కారణంగా గుండె, మెదడు, కీళ్ళు తదితర అవయవాలకు మేలు చేస్తుంది. ఆలివ్ ఆయిల్ వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. ఆలివ్‌ ఆయిల్‌తో తేనెను కలిపి ముఖానికి రాసి మెత్తని సున్నిపిండితో రుద్దుకుని కడుక్కుంటే ముఖవర్ఛస్సు పెరుగుతుంది.
 
పిల్లలకు ఆలివ్‌ఆయిల్‌ను ఒంటికి పట్టించి మెత్తని సెనగపిండితో రుద్ది స్నానం చేయిస్తే పిల్లల లేతచర్మం కాంతివంతంగా మారుతుంది. ఆలివ్‌ఆయిల్‌లో తాజా గులాబీపూల రసాన్ని కలిపి పెదాలకు రాస్తుంటే, పెదాలు మంచిరంగుతో ఆకర్షణీయంగా కనిపిస్తాయి. ఆలివ్‌ ఆయిల్‌ను వేడి చేసి వెంట్రుకల కుదుళ్ళకు పట్టించి పది నిమిషాల తర్వాత తలస్నానం చేస్తే జుట్టు రాలిపోకుండా వుంటుంది.
 
ఆలివ్ ఆయిల్‌లో వెల్లుల్లి పొట్టును కాల్చిన పొడిని కలిపి కాచి తలకు రాసుకుంటే జుట్టు నల్లబడి త్వరగా జుట్టు నెరవదు. పొడిచర్మం ఉన్నవారు ఆలివ్‌ఆయిల్‌లో నిమ్మరసాన్ని కలిపి ముఖానికి రాస్తే ముఖ చర్మం తేమగా, కాంతివంతంగా మారుతుంది.
 
ఆలివ్ ఆయిల్ గుండె ధమనుల పనితీరుకు అడ్డంకిగా మారే కొవ్వును తొలగించి రక్తప్రసరణలను మరింతగా పెంచుతుంది. ఆలివ్ ఆయిల్‌లో ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు శరీరంలో మంచి కొలెస్ట్రాల్‌ను పెంపొందింపజేస్తాయి.
తర్వాతి కథనం
ఉసిరి కాయలు వచ్చాయి, తింటే ఎన్ని ప్రయోజనాలో తెలుసా?