1. ఇతరాలు
  2. మహిళ
  3. సౌందర్యం
  4. Immune system responsible for some types of hair loss

కంటి నిండా నిద్రలేకపోతే జుట్టు రాలుతుందంతే.. వ్యాధి నిరోధక శక్తి లేకపోయినా?

హెయిర్ డ్రయర్స్ అతిగా వాడటం, కొన్ని మందులు వాడటం, ఆపరేషన్ తర్వాత, హిమోగ్లోబిన్ తక్కువైతే జుట్టు రాలే సమస్య తలెత్తుతుంది. పోషకాహార లోపం వల్ల కూడా జుట్టు రాలిపోతుంది. బరువు తగ్గడంతో పాటు పాటించే ఆహార ని

Immune system
హెయిర్ డ్రయర్స్ అతిగా వాడటం, కొన్ని మందులు వాడటం, ఆపరేషన్ తర్వాత, హిమోగ్లోబిన్ తక్కువైతే జుట్టు రాలే సమస్య తలెత్తుతుంది. పోషకాహార లోపం వల్ల కూడా జుట్టు రాలిపోతుంది. బరువు తగ్గడంతో పాటు పాటించే ఆహార నియమాల వల్ల కూడా హెయిర్ ఫాల్ తప్పదు. ఒత్తిడికి గురైనా జుట్టు రాలుతుంది. 
 
చుండ్రు సమస్యతో కూడా జుట్టు రాలిపోతాయని హెయిర్ కేర్ నిపుణులు అంటున్నారు. కానీ జుట్టు రాలిపోవడాన్ని నిరోధించడానికి వైద్యపరమైన ప్రత్యామ్నాయాలు ఉన్నా మంచి ఆరోగ్యంతోపాటు రోగ నిరోధకశక్తి ఉంటే జుట్టు రాలడం తగ్గుతుందని వారు సూచిస్తున్నారు. 
 
అందుకే ప్రతిరోజూ ప్రోటీన్లు, ఖనిజాలు, విటమిన్లు, యాంటాక్సిడెంట్లు ఉండే ఆహారాన్ని తీసుకోమంటున్నారు. అలాగే సమతులాహారం తీసుకోవాలి. చేపలు, దాల్‌, మొలకలు, పాలు, బాదం, కూరగాయలు, సీజనల్‌ ఫ్రూట్స్‌ బాగా తినాలి. వ్యాయామాలు, యోగ, ఏరోబిక్స్‌ వంటివి చేయడం వల్ల రక్తంలో చేరిన ఆక్సిజన్‌ శరీరానికంతా అంది ఆరోగ్యంగా ఉంటారు. మంచి నిద్ర కూడా శిరోజాల పరిరక్షణకు అవసరమేనని హెయిర్ కేర్ నిపుణులు అంటున్నారు.
About Writer
Selvi
తర్వాతి కథనం
నిద్రలేమితో అనారోగ్య సమస్యలు అనేకం