అధికరక్తపోటును అధిగమించాలంటే.. అంజీర తినాల్సిందే.. బరువు తగ్గాలంటే?
వయసుతో సంబంధం లేకుండా చాలామందిలో అధికరక్తపోటు సమస్య వేధిస్తోంది. దీన్ని అదుపు చేయాలంటే పొటాషియం, సోడియం పుష్కలంగా లభించే పదార్థాలను ఎక్కువగా తీసుకోవాలి. ఈ పోషకాలు అంజీరలో లభిస్తాయి. అవి అధికరక్తపోటును
వయసుతో సంబంధం లేకుండా చాలామందిలో అధికరక్తపోటు సమస్య వేధిస్తోంది. దీన్ని అదుపు చేయాలంటే పొటాషియం, సోడియం పుష్కలంగా లభించే పదార్థాలను ఎక్కువగా తీసుకోవాలి. ఈ పోషకాలు అంజీరలో లభిస్తాయి. అవి అధికరక్తపోటును అదుపులో ఉంచుతాయి. సంతానం కోరుకునేవారూ అంజీరను ఎంత తీసుకుంటే అంత మంచిది. దీనిలో అధికంగా ఉండే మెగ్నీషియం, మాంగనీసు, జింకు సంతాన సాఫల్యత పెంచడంలో కీలక పాత్ర పోషిస్తాయి.
ఇంకా బరువు తగ్గాలనుకునేవారికి అంజీర ఎంతో మేలు చేస్తుంది. కొన్ని అంజీర ముక్కల్ని భోజనానికి ముందే తీసుకోవడం ద్వారా పొట్ట నిండినట్లుంది. అతిగా తినే సమస్యను దూరం చేసుకోవచ్చు. కొలెస్ట్రాల్ సమస్య ఉండదు.
హృద్రోగాలతో బాధపడేవారు ప్రతిరోజూ తీసుకునే ఆహారంలో అంజీర చేర్చుకుంటే మేలు. ఇందులో పెక్టిన్ అనే పదార్థం శరీరంలోని వ్యర్థాలనూ తొలగిస్తుంది. గుండెకూ మేలుచేస్తుంది. మహిళల్లో రక్తహీనత సమస్య ఎక్కువగా ఉంటుంది. అలాంటి వారు రోజూ అంజీర తీసుకోవడం మంచిది. ఇందులో హిమోగ్లోబిన్ స్థాయుల్ని పెంచే పోషకాలు అధికం. అందుకే రక్తహీనతను దూరం చేసుకోవచ్చునని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.