సంబంధిత వార్తలు
- జీఎస్టీ వసూళ్లలో సరికొత్త రికార్డు - తెలుగు రాష్ట్రాల్లో భారీ వృద్ధి
- బ్యాంకు ఖాతాదారులకు అలెర్ట్ - మే నెలలో 12 రోజుల సెలవులు
- వ్యాపారులకు ఉపశమనం... తగ్గిన వాణిజ్య సిలిండర్ ధర
- “నమ్మకం అంశాన్ని” కస్టమర్లు ఎలా పొందుతారో వివరించిన ఫ్యూచర్ జెనరాలి ఇండియా లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్
- భారతదేశపు మొట్టమొదటి గేర్డ్ ఎలక్ట్రిక్ మోటర్‌బైక్ ఎరా ప్రీ-బుకింగ్ కోసం ఫ్లిప్‌కార్ట్‌తో భాగస్వామ్యం
జియో కస్టమర్ల కోసం జియో ఫైబర్...
దేశంలో హైస్పీడ్ ఇంటర్నెట్ వినియోగం రోజురోజుకూ పెరిగిపోతోంది. ఓటీటీలకు సైతం విస్తృత ఆదరణ పెరుగుతుంది. ఈ నేపథ్యంలో కస్టమర్ల అభిరుచులకు అనుగుణంగా జియో ఫైబర్ ఎప్పటికప్పుడు కొత్త బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్లను తీసుకొస్తుంది. ఈ నేపథ్యంలో ఇటీవల రూ.899 (జీఎస్ఓటీ అదనం)తో ప్రత్యేక ప్యాక్‌ను ప్రవేశపెట్టింది. దీంట్లో ప్రయోజనాలు ఎలా ఉన్నాయో చూద్దాం..
నెలకు రూ.899 (జీఎస్టీ అదనం)తో వస్తున్న ఈ ప్లాన్‌లో మొత్తం 14కు పైగా ఓటీటీ (OTT) యాప్లకు యాక్సెస్ ఉంటుంది. మూడు, ఆరు, 12 నెలల కాలవ్యవధితో కూడా ప్లాన్లు అందుబాటులో ఉన్నాయి. నెలకు 3.3 టీబీ వరకు 'ఫెయిర్ యూసేజ్ పాలసీ (FUP)' పరిమితి ఉంటుంది. అంటే దాదాపు ఎలాంటి అంతరాయం లేకుండా నెలంతా 100 ఎంబీపీఎస్ వేగంతో ఇంటర్నెట్‌ను ఎంజాయ్ చేయొచ్చు.
ఈ 100 ఎంబీపీఎస్ ప్లాన్‌తో హైస్పీడ్ ఇంటర్నెట్‌తో పాటు 550కి పైగా టీవీ ఛానెళ్లను సైతం వీక్షించొచ్చు. లైవ్లో టీవీ షోలు, స్పోర్ట్స్ చూసేవారికి ఇది మంచి ఆప్షన్. ఈ ప్లాన్ తీసుకున్నవారికి జియో సెటాప్ బాక్స్‌ను ఉచితంగానే అందిస్తారు. ఓటీటీల విషయానికి వస్తే డిస్నీ+ హాట్‌స్టార్, జీ5, సోనీలివ్, డిస్కవరీ ప్లస్, ఈరోస్ నౌ, జియో సినిమా సహా మొత్తం 14కి పైగా యాప్లకు యాక్సెస్ ఉంటుంది.
తర్వాతి కథనం
