సంబంధిత వార్తలు
- గృహ రుణాలపై వడ్డీ రేట్లు తగ్గించిన ఎస్బీఐ.. అంతా కరోనా ఎఫెక్ట్..
- కరోనా పుణ్యం.. ఇళ్ల కొనుగోలు 67 శాతానికి పడిపోయింది.. రియల్ ఎస్టేట్ కుదేలు
- హోమ్ లోన్ తీసుకోవాలనుకుంటున్నారా? అదిరే ఆఫర్ ఇదో..!
- కొటక్ మహింద్రా బ్యాంక్ ఆధ్వర్యంలో కూలీలకు హైదరాబాద్ ఏపీఎంసీ మార్కెట్ల వద్ద రేషన్ కిట్ల అందజేత
- ఓటీపీ ఉంటేనే గ్యాస్ సిలిండర్ డెలవరీ.. నవంబరు నుంచి నయా రూల్!
గృహరుణాలు తీసుకున్న వారికి గుడ్ న్యూస్..?
ప్రైవేట్‌కు చెందిన ఆర్థిక సేవల సంస్థ కొటక్ మహీంద్రా బ్యాంక్.. గృహ రుణాలు తీసుకున్నవారికి శుభవార్తను అందించింది. గృహ రుణాలపై వడ్డీరేటును 7 శాతానికి దించింది. బ్యాంకింగ్ దిగ్గజం ఎస్బీఐ అందిస్తున్న వడ్డీరేటుకే కొటక్ అందిస్తుండటం విశేషం. ప్రస్తుత పండుగ సీజన్‌లో రుణాలు తీసుకునేవారిని ఆకట్టుకోవాలనే ఉద్దేశంతో బ్యాంక్.. రిటైల్, వ్యవసాయరుణాలపై ప్రాసెసింగ్ ఫీజును ఎత్తివేయడంతోపాటు వేగంగా ఆన్‌లైన్ అనుమతులు జారీచేసింది.
ఈ ప్రత్యేక స్కీం నెల రోజుల పాటు అమలులో ఉండనుంది. బ్యాంక్ తీసుకున్న తాజా నిర్ణయంతో గృహ రుణాలపై వడ్డీరేటు 7 శాతంతో ప్రారంభమవనుండగా, ఇతర బ్యాంక్‌ల నుంచి బదిలీ చేసుకునేవారికి రూ.20 లక్షల వరకు లబ్ధిపొందనున్నారు. ఎస్బీఐ మాత్రం రూ.30 లక్షల లోపు రుణాలపై 7 శాతం వడ్డీని వసూలు చేస్తున్నది. మహిళలకు మరో 0.05 శాతం రాయితీ ఇస్తుంది.
