శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 16 సెప్టెంబరు 2020 (21:46 IST)

గృహ రుణాలపై వడ్డీ రేట్లు తగ్గించిన ఎస్బీఐ.. అంతా కరోనా ఎఫెక్ట్..

SBI
దేశంలో కరోనా మహమ్మారి విజృంభన నేపథ్యంలో ఆర్బీఐ రెపో రేటును 4 శాతానికి తగ్గించింది. దీంతో ఎస్బీఐ కూడా గృహ రుణాలపై వడ్డీ రేట్లను తగ్గించింది. దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకైన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) ప్రస్తుత గృహ రుణగ్రహీతలకు రెపో రేటుతో అనుసంధానించబడిన నూతన వడ్డీ రేటుకు మారడానికి అవకాశాన్ని ఇచ్చింది. 
 
ఇందుకోసం కస్టమర్ వన్ టైమ్ స్విచ్ఓవర్ ఫీజుతో పాటు జీఎస్టీ చెల్లించాలి. ప్రస్తుత ఎస్బీఐ గృహ రుణ వడ్డీ రేట్లు 7శాతం నుండి 7.35 శాతం పరిధిలో ఉన్నాయి. ఈ వడ్డీ రేట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) రెపో రేటుతో ముడిపడి ఉంటాయి. 
 
మహిళా రుణగ్రహీతలకు వడ్డీ రేట్లపై ఎస్బీఐ 0.05% ప్రత్యేక తగ్గింపును అందిస్తుంది. కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా ఆర్బీఐ రెపో రేటును 4 శాతానికి తగ్గించింది. దాని తరువాత గృహ రుణాలపై వడ్డీ రేట్లు బాగా పడిపోయాయి. బ్యాంకులు అందించే గృహ రుణాలపై వడ్డీ రేట్లు ప్రస్తుతం ఎక్స్టర్నల్ బెంచ్ మార్క్(ఈబీఆర్)తో అనుసంధానించబడ్డాయి.
 
రుణగ్రహీతలకు గృహ రుణాలపై మూడు ప్రత్యేక ఆఫర్లను ఎస్బీఐ ప్రకటించింది. ఎస్బీఐ యోనో యాప్ ద్వారా లోన్ తీసుకుంటే మరో 0.05 శాతం వడ్డీ రాయితీ ఉంటుంది. అంతేకాక కొత్తగా తీసుకునే రుణాలకు ప్రాసెసింగ్ ఫీజు ఉండదు. రుణాల కోసం ఎంసిఎల్ఆర్ రీసెట్ ఫ్రీక్వెన్సీని ఎస్బిఐ ఒక సంవత్సరం నుండి ఆరు నెలలకు తగ్గించింది.