గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 12 ఆగస్టు 2020 (18:38 IST)

గోల్డ్ లోన్ ఇచ్చేందుకు పోటీపడుతున్న బ్యాంకులు.. చౌక వడ్డీకే ఎస్బీఐ?

కరోనా వైరస్ నేపథ్యంలో.. ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారు.. గోల్డ్ లోన్ తీసుకోవాలనుకుంటున్నారా? అయితే ఇది మీకు గుడ్ న్యూసే. అన్ని బ్యాంకుల కన్నా దేశీ అతిపెద్ద బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) చౌక వడ్డీకే రుణాలు అందిస్తోంది. ఎస్‌బీఐలో గోల్డ్ లోన్‌పై వడ్డీ రేటు 7 శాతం నుంచి ప్రారంభమౌతోంది. 
 
పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్‌బీ)లో గోల్డ్ లోన్‌పై వడ్డీ రేటు 8.6 శాతంగా ఉంది. ఇక దిగ్గజ ప్రైవేట్ రంగ బ్యాంక్ హెచ్‌డీఎఫ్‌సీలో గోల్డ్ లోన్ తీసుకుంటే 9.9 శాతం వడ్డీ చెల్లించాలి. అలాగే మరో ప్రైవేట్ రంగ ప్రముఖ బ్యాంక్ ఐసీఐసీఐ బ్యాంక్‌లో గోల్డ్ లోన్స్‌పై వడ్డీ రేటు 10 శాతం నుంచి ప్రారంభమౌతోంది.
 
కెనరా బ్యాంక్‌లో వడ్డీ రేటు 7.65 శాతం నుంచి ఆరంభమౌతోంది. యాక్సిస్ బ్యాంక్‌లో 9.75 శాతం నుంచి గోల్డ్ లోన్ పొందొచ్చు. ఇక ముత్తూట్ ఫైనాన్స్‌లో అయితే గోల్డ్ లోన్ వడ్డీ రేటు 12 శాతం నుంచి ప్రారంభమౌతోంది. లోన్ తీసుకోవడానికి పాన్ కార్డ్, ఆధార్ కార్డ్, ఓటర్ కార్డ్ వంటి డాక్యుమెంట్లు అవసరం అవుతాయి.