1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
  4. PhonePe Launches Device Tokenisation For Debit, Credit Card Payments - Know Benefits

ఫోన్‌ఫే నుంచి కొత్త ఫీచర్.. క్రెడిట్ - డెబిట్ కార్డుల కోసం..

phonepay
ప్రముఖ డిజిటల్ చెల్లింపుల సంస్థ ఫోన్‌పే మరో సరికొత్త ఫీచర్‌ను అందుబాటులో తీసుకొచ్చింది. క్రెడిట్, డెబిట్ కార్డుల కోసం డివరైజ్ టొకనైజేషన్ సొల్యూషన్స్‌ను ప్రారంభించింది. ఫోన్‌పే వినియోగదారులు యాప్‌లో తమ కార్డును టోకనైజ్ చేసుకోవచ్చు. దీని ద్వారా తమ బిల్లుల చెల్లింపులు సులభంగా చేసుకోవచ్చు. 
 
ఫోన్‌పే వినియోగదారులు తమ కార్డులను టోకనైజ్ చేయడం ద్వారా అనేక ప్రయోజనాలు పొందవచ్చు. ఇకపై ప్రతినెల లావాదేవీకి తమ కార్డు వివరాలను మర్చంట్ వేదికపై భద్రపరచాల్సిన అవసరం ఉండదు. అలాగే, సీవీవీ వివరాలను నమోదు చేయాల్సిన అవసరం కూడా ఉండదని ఫోన్‌పే తెలిపింది. 
 
టోకనైజ్డ్ కార్డులను ఫోన్‌‍కు సురక్షితంగా అనుసంధానించడం వల్ల మోసాల బారినపడకుండా ఉండవచ్చు. దీనివల్ల వినియోగదారులకు ఆన్‌లైన్ చెల్లింపులపై భరోసా పెరుగుతుంది. ప్రారంభంలో వినియోగదారులు వీసా క్రెడిట్, డెబిట్ కార్డులను టోకనైజ్డ్ చోసుకేవచ్చని ఫోన్‌పే తెలిపింది. ఫోన్‌పే చెల్లింపు గేట్‌వే సేవలు అనుసంధానమైన ఆన్‌లైన వ్యాపారుల వద్ద కూడా కార్డులను టోకనైజ్డ్ చేసుకోవచ్చు. 
తర్వాతి కథనం
రూ.15 కోట్లు పెట్టిన ప్యాన్సీ నంబర్ కొన్నాడు... ఎక్కడ?