హ్యుందాయ్ బాయోన్తో లభించే సురక్షిత ప్రయాణం
హ్యుందాయ్ మోటార్ ఇండియా లిమిటెడ్ (హెచ్ఎమ్ఐఎల్) తన నూతన ఇంటెలిజెంట్ యుటిలిటీ వాహనం విడుదలకు ముందు, ఈ రోజు 'హ్యుందాయ్ బాయోన్' భద్రతా ఫీచర్లను వెల్లడించింది. గ్లోబల్ కే ఎన్హాన్స్డ్ ప్లాట్‌ఫామ్‌పై నిర్మితమైన హ్యుందాయ్ బాయోన్, భారతీయ 5-స్టార్ భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా తీర్చిదిద్దబడింది. బలపరిచిన బాడీ స్ట్రక్చర్, హై-స్ట్రెంగ్త్ స్టీల్ సాంకేతికతలు, హ్యుందాయ్ స్మార్ట్‌సెన్స్ లెవెల్ 2 ప్రో ఏడాస్- హైవే డ్రైవింగ్ ఇంటెలిజెన్స్ మరియు విస్తృతమైన భద్రతా ఫీచర్లతో హ్యుందాయ్ బాయోన్ ప్రయాణికులకు సురక్షితమైన ప్రయాణ అనుభవాన్ని అందిస్తుంది.
హ్యుందాయ్ బాయోన్ భద్రతా సాంకేతికతలపై హ్యుందాయ్ మోటార్ ఇండియా లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్- సీఈఓ శ్రీ తరుణ్ గర్గ్ మాట్లాడుతూ, “హ్యుందాయ్‌లో, నిజమైన ఆవిష్కరణ అనేది వినియోగదారుల రోజువారీ అనుభవాలను మెరుగుపరిచినప్పుడే అర్థవంతంగా ఉంటుందని మేము నమ్ముతున్నాము. హ్యుందాయ్ బాయోన్తో, సమగ్ర భద్రతా అనుభవాన్ని అందించడానికి మేము బలమైన బాడీ స్ట్రక్చర్, అడ్వాన్స్డ్ భద్రతా సాంకేతికతలు మరియు ఇంటెలిజెంట్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్‌లను మేళవించాము. బలమైన ఛాసిస్, హై-స్ట్రెంగ్త్ స్టీల్ నిర్మాణం నుండి హ్యుందాయ్ స్మార్ట్‌సెన్స్ లెవెల్ 2 ప్రో ఏడాస్ వరకు ప్రయాణంలో నమ్మకాన్ని కలిగించేలా బాయోన్ రూపకల్పన జరిగింది" అని అన్నారు.
హ్యుందాయ్ బాయోన్ ఎలాంటి భద్రతా ఫీచర్లను అందిస్తుంది?
హ్యుందాయ్ బాయోన్ తన అన్ని వేరియంట్లలో 80 కంటే ఎక్కువ అడ్వాన్స్డ్ సేఫ్టీ ఫీచర్లను, 35 కంటే ఎక్కువ స్టాండర్డ్ సేఫ్టీ ఫీచర్లను అందిస్తూ ప్రయాణికుల చుట్టూ సురక్షితమైన వాతావరణాన్ని సృష్టిస్తుంది. ఈ భద్రతా ప్యాకేజీలో హ్యుందాయ్ స్మార్ట్‌సెన్స్ లెవెల్ 2 ప్రో ఏడాస్, బలపరిచిన ఛాసిస్, హై-స్ట్రెంగ్త్ స్టీల్ నిర్మాణం, స్టాండర్డ్ 6 ఎయిర్‌బ్యాగ్‌లు, సరౌండ్ వ్యూ మానిటర్, బ్లైండ్-స్పాట్ వ్యూ మానిటర్, హిల్-స్టార్ట్ అసిస్ట్ కంట్రోల్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్,ఆల్-వీల్ డిస్క్ బ్రేక్స్ వంటి సాంకేతికతలు ఉన్నాయి.
ప్రమాద సమయాల్లో హ్యుందాయ్ బాయోన్ ప్రయాణికులను ఎలా కాపాడుతుంది?
హ్యుందాయ్ బాయోన్ గ్లోబల్ కే ఎన్హాన్స్డ్ ప్లాట్‌ఫామ్‌పై నిర్మించబడింది. ఇది బలపరిచిన ఛాసిస్, వివిధ రకాల హై-స్ట్రెంగ్త్ స్టీల్‌తో రూపొందించబడింది.
ప్రమాదాల సమయంలో ప్రభావాన్ని తగ్గించి ప్రయాణికులకు మెరుగైన రక్షణ కల్పించేలా దీని బాడీ నిర్మాణం ఉంది. ఫ్రంట్ ఏప్రాన్, డాష్‌బోర్డ్, వెనుక ఫ్లోర్ మరియు సైడ్ భాగాలతో సహా కీలక ప్రాంతాలలో హాట్-స్టాంప్డ్ భాగాలు ఉపయోగించబడ్డాయి.హాట్-స్టాంప్డ్ వెనుక ఫ్లోర్ భాగాలు వెనుక నుండి జరిగే ప్రమాదాల నుండి రక్షణను పెంచుతాయి. అలాగే డ్యూయల్-బాక్స్ నిర్మాణం, మల్టిపుల్ లోడ్ పాత్‌లు, రింగ్-టైప్ నిర్మాణం ప్రమాద తీవ్రతను పంపిణీ చేసి క్యాబిన్ లోపలికి ప్రభావం పడకుండా చూస్తాయి.
హ్యుందాయ్ బాయోన్ బాడీ స్ట్రక్చర్‌లో 69% అడ్వాన్స్డ్ మల్టీ-గ్రేడ్ హై-స్ట్రెంగ్త్ స్టీల్ ఉపయోగించబడింది. ఇందులో హాట్ స్టాంపింగ్, ఆల్ట్రా హై స్ట్రెంగ్త్ స్టీల్, అడ్వాన్స్డ్ హై స్ట్రెంగ్త్ స్టీల్, హై స్ట్రెంగ్త్ స్టీల్ విలీనం చేయబడ్డాయి. ఇవన్నీ కలిసి భారతీయ 5-స్టార్ భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా బలమైన బాడీ నిర్మాణాన్ని అందిస్తాయి.
భారతీయ 5-స్టార్ భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా హ్యుందాయ్ బాయోన్ ఎలా రూపొందించబడింది?
హ్యుందాయ్ బాయోన్ భద్రత దాని ప్లాట్‌ఫామ్ మరియు బాడీ నిర్మాణంతోనే ప్రారంభమవుతుంది. గ్లోబల్ కే ఎన్హాన్స్డ్ ప్లాట్‌ఫామ్‌పై నిర్మితమైన బాయోన్, భారతీయ 5-స్టార్ భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా తీర్చిదిద్దబడింది. ఈ ప్లాట్‌ఫామ్ వాహనం యొక్క బలమైన నిర్మాణ డిజైన్‌కు పునాదిగా నిలుస్తుంది.
ఈ ప్లాట్‌ఫామ్ ఆర్కిటెక్చర్ మరియు బాడీ నిర్మాణం కేవలం విడి సాంకేతికతలపైనే ఆధారపడకుండా, తయారీ ప్రారంభ దశ నుండే భద్రతను విలీనం చేసే హ్యుందాయ్ విధానాన్ని ప్రతిబింబిస్తాయి.
హ్యుందాయ్ స్మార్ట్‌సెన్స్ లెవెల్ 2 ప్రో ఏడాస్ (ADAS) సురక్షితమైన డ్రైవింగ్‌కు ఎలా తోడ్పడుతుంది? హ్యుందాయ్ బాయోన్లో 23 రకాల హ్యుందాయ్ స్మార్ట్‌సెన్స్ లెవెల్ 2 ప్రో ఏడాస్ (ADAS) సాంకేతికతలు ఉన్నాయి:
ఫార్వర్డ్ కొలిజన్ వార్నింగ్ (FCW)
ఫార్వర్డ్ కొలిజన్-అవాయిడెన్స్ అసిస్ట్ – కార్ (FCA)
ఫార్వర్డ్ కొలిజన్-అవాయిడెన్స్ అసిస్ట్ – పెడెస్ట్రియన్ (FCA-Ped)
ఫార్వర్డ్ కొలిజన్-అవాయిడెన్స్ అసిస్ట్ – సైకిల్ (FCA-Cyl)
ఫార్వర్డ్ కొలిజన్-అవాయిడెన్స్ అసిస్ట్ – జంక్షన్ టర్నింగ్ (FCA-JT)
ఫార్వర్డ్ కొలిజన్-అవాయిడెన్స్ అసిస్ట్ – డైరెక్ట్ ఆన్‌కమింగ్ (FCA-DO)
బ్లైండ్-స్పాట్ కొలిజన్-అవాయిడెన్స్ అసిస్ట్ (BCA)
లేన్ కీపింగ్ అసిస్ట్ (LKA)
లేన్ డిపార్చర్ వార్నింగ్ (LDW)
డ్రైవర్ అటెన్షన్ వార్నింగ్ (DAW)
సేఫ్ ఎగ్జిట్ వార్నింగ్ (SEW)
బ్లైండ్-స్పాట్ కొలిజన్ వార్నింగ్ (BCW)
రియర్ క్రాస్-ట్రాఫిక్ కొలిజన్ వార్నింగ్ (RCCW)
రియర్ క్రాస్-ట్రాఫిక్ కొలిజన్-అవాయిడెన్స్ అసిస్ట్ (RCAA)
సరౌండ్ వ్యూ మానిటర్ (SVM)
బ్లైండ్-స్పాట్ వ్యూ మానిటర్ (BVM)
స్మార్ట్ క్రూయిజ్ కంట్రోల్ విత్ స్టాప్ & గో (SCC with S&G)
లేన్ ఫాలోయింగ్ అసిస్ట్ (LFA)
హై బీమ్ అసిస్ట్ (HBA)
లీడింగ్ వెహికల్ డిపార్చర్ అలర్ట్ (LVDA)
నావిగేషన్-బేస్డ్ స్మార్ట్ క్రూయిజ్ కంట్రోల్ జోన్ (NSCC-Z)
నావిగేషన్-బేస్డ్ స్మార్ట్ క్రూయిజ్ కంట్రోల్ కర్వ్ (NSCC-C)
హైవే డ్రైవింగ్ అసిస్ట్ (HDA)
ఈ సాంకేతికతలు ఎక్స్‌ప్రెస్‌వేలు, హైవేలు, నగర రహదారులు, జంక్షన్లు, పార్కింగ్ మరియు రోజువారీ ట్రాఫిక్ పరిస్థితుల్లో స్మార్ట్ సహాయాన్ని అందిస్తాయి.
హ్యుందాయ్ బాయోన్లో లభించే ప్రామాణిక భద్రతా ఫీచర్లు ఏమిటి?
హ్యుందాయ్ బాయోన్ తన అన్ని మోడళ్లలో 35 కంటే ఎక్కువ భద్రతా ఫీచర్లను ప్రామాణికంగా అందిస్తుంది.
వీటిలో ముఖ్యమైనవి:
రోల్ ఓవర్ సెన్సార్
టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ (TPMS) – హై
6 ఎయిర్‌బ్యాగ్‌లు
హిల్-స్టార్ట్ అసిస్ట్ కంట్రోల్ (HAC)
ఎమర్జెన్సీ స్టాప్ సిగ్నల్ (ESS)
బర్గ్లర్ అలారం
హెడ్‌ల్యాంప్ ఎస్కాటోర్ట్ ఫంక్షన్
ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ESC)
3 పాయింట్ సీట్‌బెల్ట్ & సీట్‌బెల్ట్ రిమైండర్
సెంట్రల్ లాకింగ్
ఐసోఫిక్స్ (ISOFIX)
రియర్ పార్కింగ్ సెన్సార్లు
హ్యుందాయ్ బాయోన్ భద్రతను, ఇంటెలిజెంట్ మొబిలిటీని ఎలా అనుసంధానిస్తుంది?
ఒక ఇంటెలిజెంట్ యుటిలిటీ వాహనంగా, హ్యుందాయ్ బాయోన్ బలమైన ఇంజనీరింగ్, స్మార్ట్ డ్రైవర్ అసిస్టెన్స్ సాంకేతికతలు మరియు సమగ్ర భద్రతా ప్యాకేజీని ఒకే వ్యవస్థ కిందకు తీసుకువస్తుంది. దీనిలో ప్రధానమైనది 'హ్యుందాయ్ స్మార్ట్‌సెన్స్ లెవెల్ 2 ప్రో ఏడాస్' – హైవే డ్రైవింగ్ ఇంటెలిజెన్స్. ఇది 23 అడ్వాన్స్డ్ డ్రైవర్ అసిస్టెన్స్ ఫంక్షన్లు, 3 రాడార్లు మరియు 12 పార్కింగ్ సెన్సార్లతో కలిసి పనిచేస్తూ డ్రైవర్ అవగాహనను, నమ్మకాన్ని పెంచుతుంది.
ఇరుకైన ప్రాంతాలలో వాహనాన్ని నడిపేటప్పుడు అవసరమైన పూర్తి అవగాహనను అందించడానికి హ్యుందాయ్ బాయోన్ స్మార్ట్ కెమెరా మరియు సెన్సింగ్ సాంకేతికతలను ఉపయోగిస్తుంది. ఇందులో ఉన్న సరౌండ్ వ్యూ మానిటర్ (SVM) వాహనం చుట్టూ ఉన్న పరిసరాలను స్పష్టంగా చూపిస్తుంది. అలాగే బ్లైండ్-స్పాట్ వ్యూ మానిటర్ (BVM) సాధారణ అద్దాలలో కనిపించని ప్రాంతాలను స్క్రీన్‌పై ప్రదర్శిస్తుంది. ఈ వాహనంలో ఫ్రంట్ పార్కింగ్ సెన్సార్లు కూడా ఉన్నాయి. రివర్స్ చేసే సమయంలో అదనపు రక్షణ కోసం 'రియర్ క్రాస్-ట్రాఫిక్ కొలిజన్ వార్నింగ్' మరియు 'రియర్ క్రాస్-ట్రాఫిక్ కొలిజన్-అవాయిడెన్స్ అసిస్ట్'లు సహాయపడతాయి.
హైవేలు, ఎక్స్‌ప్రెస్‌వేలపై ప్రయాణాన్ని మరింత సుఖమయంగా, సౌకర్యవంతంగా మార్చడానికి హ్యుందాయ్ బాయోన్ ఏడాస్ లెవెల్ 2 ప్రో అత్యంత ఆధునిక డ్రైవింగ్ అనుభవాన్ని అందిస్తుంది. ఇందులో 'స్మార్ట్ క్రూయిజ్ కంట్రోల్ విత్ స్టాప్ & గో' (SCC with S&G) మరియు 'లేన్ ఫాలోయింగ్ అసిస్ట్' (LFA)లతో పాటు, 'నావిగేషన్-బేస్డ్ స్మార్ట్ క్రూయిజ్ కంట్రోల్ కర్వ్ & జోన్' (NSCC-C & NSCC-Z)*, మరియు 'హైవే డ్రైవింగ్ అసిస్ట్' (HDA) సాంకేతికతలు విలీనమయ్యాయి.
అంతేకాకుండా బాయోన్లో 'లేన్ డిపార్చర్ వార్నింగ్' (LDW) మరియు 'లేన్ కీపింగ్ అసిస్ట్' (LKA) ఫీచర్లు కూడా ఉన్నాయి.వాహనం అనుకోకుండా లేన్ దాటుతుంటే LDW హెచ్చరిస్తుంది. అలాగే వాహనాన్ని సరైన లేన్‌లో ఉంచడానికి LKA స్టీరింగ్‌కు అవసరమైన సహాయాన్ని అందిస్తుంది. ఇక కారును నిలిపివేసినప్పుడు, ముఖ్యంగా రద్దీగా ఉండే నగర వాతావరణంలో ప్రయాణికులు తలుపులు తెరిచే సమయంలో వెనుక నుండి ఇతర వాహనాలు వస్తుంటే 'సేఫ్ ఎగ్జిట్ వార్నింగ్' (SEW) వ్యవస్థ హెచ్చరికలు జారీ చేస్తుంది. ఇది అదనపు రక్షణను ఇస్తుంది.
స్మార్ట్ మొబిలిటీని సమగ్ర భద్రతతో అనుసంధానించడంలో హ్యుందాయ్ నిబద్ధతకు హ్యుందాయ్ బాయోన్ నిదర్శనంగా నిలుస్తుంది. నవభారత వినియోగదారులు మరియు వారి కుటుంబాల మారుతున్న అవసరాలకు అనుగుణంగా రూపొందించిన ఇంటెలిజెంట్ యుటిలిటీ వాహనంగా ఇది సేవలందిస్తుంది.
హ్యుందాయ్ బాయోన్లో ఏ రంగుల ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి?
హ్యుందాయ్ బాయోన్ వినియోగదారులు తమ వ్యక్తిత్వానికి, జీవనశైలికి అనుగుణమైన శైలిని ఎంచుకోవడానికి వీలుగా ఆకర్షణీయమైన, ప్రీమియం మరియు స్పష్టమైన రంగులను అందిస్తోంది. ఈ ఇంటెలిజెంట్ ఎస్యూవీ మోనోటోన్,మ్యాట్ మరియు డ్యూయల్-టోన్ విభాగాల్లో 10 ఎక్స్టీరియర్ రంగుల ఆప్షన్లలో అందుబాటులో ఉంటుంది.
భారతదేశంలో హ్యుందాయ్ బాయోన్ ఎప్పుడు విడుదలవుతుంది?
హ్యుందాయ్ బాయోన్ భారతదేశంలో 2026 అక్టోబర్ 26న విడుదల కానుంది.
హ్యుందాయ్ బాయోన్ను ఎలా బుక్ చేసుకోవచ్చు?
వినియోగదారులు హ్యుందాయ్ అధికారిక వెబ్సైట్ (hyundai.co.in) ద్వారా లేదా ఏదేని అధికారిక హ్యుందాయ్ డీలర్‌షిప్‌లో రూ. 11,000 బుకింగ్ మొత్తంతో హ్యుందాయ్ బాయోన్ను బుక్ చేసుకోవచ్చు.

