1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
  4. SBI Recruitment 2020 - 241 Executive Vacancies

ఎస్‌బీఐ నుంచి దరఖాస్తులు ఆహ్వానం.. మొత్తం పోస్టులు - 326

SBI Recruitment 2020
sbi bank
నిరుద్యోగులకు శుభవార్త. దేశవ్యాప్తంగా ఎస్‌బీఐ బ్యాంకుకు చెందిన బ్రాంచుల్లో పనిచేసేందుకు గాను ఆసక్తి ఉన్న భారతీయ అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఎగ్జిక్యూటివ్‌ (ఎఫ్‌ఐ అండ్‌ ఎంఎం), సీనియర్‌ ఎగ్జిక్యూటివ్‌ (సోషల్‌ బ్యాంకింగ్‌ అండ్‌ సీఎస్సార్‌) విభాగాల్లో మొత్తం 326 ఖాళీలు ఉన్నట్లు ఎస్‌బీఐ తెలిపింది. 
 
ఇందుకు గాను బ్యాంక్‌ నేరుగా రిక్రూట్‌మెంట్‌ ప్రక్రియను చేపట్టింది. ఎంపికైన అభ్యర్థులు దేశవ్యాప్తంగా ఉన్న ఏ ఎస్‌బీఐ బ్రాంచిలోనైనా పనిచేసేందుకు సిద్ధంగా ఉండాలి. ఇక ఈ ఉద్యోగాలకు గాను దరఖాస్తు ప్రక్రియను మంగళవారం నుంచి ఎస్‌బీఐ ప్రారంభించింది. జూలై 7వ తేదీ వరకు దరఖాస్తుల సమర్పణకు గడువు విధించారు.
 
మార్చి 31, 2020 వరకు ఎగ్జిక్యూటివ్‌ పోస్టుకు 30 ఏళ్లు, సీనియర్‌ ఎగ్జిక్యూటివ్‌ పోస్టుకు 35 ఏళ్లు వయస్సు మించరాదు. అప్లికేషన్‌ ఫీజు రూ.750ని నెట్‌బ్యాంకింగ్‌, డెబిట్‌, క్రెడిట్‌ కార్డుల ద్వారా ఆన్‌లైన్‌లో చెల్లించవచ్చు. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు ఫీజు చెల్లించాల్సిన పనిలేదు.
 
* ఎగ్జిక్యూటివ్‌ (ఎఫ్‌ఐ అండ్‌ ఎంఎం) - 241
* సీనియర్‌ ఎగ్జిక్యూటివ్‌ (సోషల్‌ బ్యాంకింగ్‌ అండ్‌ సీఎస్సార్‌) - 85
* మొత్తం పోస్టులు - 326
* దరఖాస్తులు ప్రారంభమయ్యే తేదీ - జూన్‌ 23, 2020
* దరఖాస్తుల సమర్పణకు ఆఖరి తేదీ - జూలై 13, 2020
About Writer
సెల్వి
తర్వాతి కథనం
ఆ 2 జిల్లాల్లో కరోనా మృత్యు ఘంటికలు : జీహెచ్ఎంసీ పరిధిలో వైరస్ విజృంభణ