1. వార్తలు
  2. కెరీర్
  3. కెరీర్ వార్తలు
  4. SBI Clerk 2026 Notification: Exam Pattern, Syllabus & Salary

#SBIJobNotification : 9,124 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

jobs
దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ సంస్థగా ఉన్న భారతీయ స్టేట్ బ్యాంకు భారీగా ఉద్యోగ పోస్టులను భర్తీ చేయనుంది. ఈ మేరకు తాజాగా నోటిఫికేషన్‌ను జారీ చేసింది. మొత్తం 9,124 క్లర్క్ పోస్టుల భర్తీకి ఈ నోటిఫికేషన్ విడుదలైంది. ఇటీవల బ్యాక్‌లాగ్ ఖాళీల భర్తీకి ప్రత్యేక రిక్రూట్మెంట్ డ్రైవ్‌లో భాగంగా, మొత్తం 1,538 పోస్టులకు నోటిఫికేషన్ జారీచేసిన విషయం తెల్సిందే. ఇపుడు కొత్తగా మరో 9 వేలకు పైగా పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ జారీచేసింది. అర్హులైన, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ నెల 11వ తేదీ నుంచి 31వ తేదీలోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని నోటిఫికేషన్‌లో పేర్కొంది. 
 
ఈ నోటిఫికేషన్‌ ప్రకారం ఎస్బీఐ మొత్తంగా రెగ్యులర్‌, బ్యాక్‌లాగ్‌ ఖాళీల్లో 9,124 ఉద్యోగాలను భర్తీ చేయనుంది. హైదరాబాద్‌ సర్కిల్‌లో 260 పోస్టులు ఉన్నాయి. గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్ లేదా తత్సమాన విద్యార్హతలు తప్పనిసరిగా కలిగివుండాలి. 
 
దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయసు 20 నుంచి 28 ఏళ్లు మించరాదు (2026 ఏప్రిల్‌ 1 నాటికి). రిజర్వేషన్ల ఆధారంగా ఆయా వర్గాల వారికి వయో పరిమితిలో సడలింపు ఉంది. డిగ్రీ ఫైనల్‌ ఇయర్‌ చదువుతున్నవారూ దరఖాస్తు చేసుకోవచ్చు. కానీ, డిసెంబరు 31 కంటే ముందే సంబంధిత ఆధారాలను సమర్పించాల్సి ఉంటుంది.
 
సెలక్షన్‌ ప్రక్రియ మూడు దశల్లో జరుగుతుంది. ఆన్‌లైన్‌లో ప్రిలిమినరీ పరీక్ష, మెయిన్‌ ఎగ్జామ్‌, లాంగ్వేజ్‌ ప్రొఫిషియెన్సీ టెస్ట్‌. జనరల్‌ / ఓబీసీ / ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులకు రూ.750, ఎస్సీ / ఎస్టీ / దివ్యాంగులకు ఎలాంటి దరఖాస్తు రుసుం లేదు. ఫీజు ఆన్‌లైన్‌లోనే చెల్లించాలి.. ప్రిలిమినరీ పరీక్ష సెప్టెంబరులో, మెయిన్‌ పరీక్ష నవంబరులో నిర్వహించే అవకాశం ఉంది. ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారికి వేతనం ఎంత, పరీక్ష విధానం ఎలా ఉంటుంది? తదితర పూర్తి వివరాలను ఎస్.బి.ఐ వెబ్‌సైట్‌ను చూడాలి. 
About Writer
ఠాగూర్
ఠాగూర్ పులపాక ప్రముఖ దినపత్రిక ఈనాడు, చెన్నై కార్యాలయంలో 'న్యూస్ కాంట్రిబ్యూటర్‌'గా జర్నలిజం ఓనమాలు నేర్చుకున్నారు. హైదరాబాద్ కార్యాలయంలో 'ఆంధ్రజ్యోతి' సబ్-ఎడిటర్ పని చేశారు. 2007 నుంచి 'వెబ్ దునియా'లో అసిస్టెంట్ ఎడిటర్‌‌గా విధులు నిర్వహిస్తున్నారు..... మరింత చదవండి
తర్వాతి కథనం
అన్నా చెన్నారెడ్డిని చంపింది మనోళ్లే.. వైకాపాకు కష్టకాలం.. లీకైన జగన్ ఆడియో కాల్..