1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. చెన్నై వార్తలు
  4. chennai dinesh dinesh kannappan murder aruna

ప్రియుడే ప్రేయసిని హతమార్చాడు: చెన్నైలో దారుణం

chennai dinesh dinesh kannappan murder aruna
ప్రియుడు ప్రేయసిని హతమార్చాడు. ఈ దారుణమైన ఘటన సోమవారం చెన్నైలో జరిగింది. వివరాల ప్రకారం దినేశ్ కన్నప్పన్ (25) ఓ ప్రైవేటు బ్యాంకులో పనిచేస్తున్నాడు. అతనితోపాటు పనిచేస్తున్న అరుణ శ్రీనివాసన్ పరిచయం ఏర్పడింది. వీరిద్దరూ గత మూడేళ్లుగా సహజీవనం చేస్తున్నారు. అయితే గత రాత్రి అనారోగ్యంతో ఉన్న తన తండ్రిని ఆస్పత్రిలో చేర్పించి అయనవరంలోని అరుణ ఫ్లాట్‌కు వెళ్లాడు. 
 
ఈ సందర్భంగా వారిద్దరి మధ్య మాటా మాటా పెరిగి ఘర్షణ చోటుచేసుకొంది. దీంతో దినేశ్ ఒక్కసారిగా ఉన్మాదిలా మారిపోయి అరుణని ఫ్లవర్ వాజ్‌తో బలంగా తలపై కొట్టడంతో ఆమె అక్కడికక్కడే మరణించింది. మృతదేహాన్ని దినేశ్ ఓ బెడ్ షిట్‌లో చుట్టి లోయలో పడేశాడు. స్థానిక యువకుడు దినేశ్ చర్యలను అనుమానించి పోలీసులకు సమాచారం అందిచగా, పోలీసులు ఘటనాస్థలానికి చేరుకునేలోపు పరారయ్యాడు. అసలు అతను ఎందుకు హత్య చేశాడో తెలియదని అతన్ని పట్టుకొని ఇంటరాగేషన్ చేస్తేకానీ వివరాలు తెలియవని పోలీసులు తెలిపారు. 
About Writer
Selvi