అంటిపెట్టుకోవద్దు
పిల్లల అభిప్రాయాలకు, అవసరాలకు తగినంత విలువ ఇవ్వాలి. వారినీ ఆలోచించుకోనివ్వాలి, విశ్లేషించుకోనివ్వాలి. వారిని ఏది మంచో, చెడో నిర్ణయించుకోగల శక్తివంతులుగా తయారు చేయాలేగానీ, ప్రతిక్షణం అంటిపెట్టుకుని అవసరాలు గమనిస్తూ ఉండాల్సిన పనిలేదు. అయితే అవసరమైనప్పుడల్లా వారికి తగినంత ప్రోత్సాహం అందజేయాల్సి ఉంటుంది.
