అల్లరి చేస్తున్నారా...?!
బాగా అల్లరి చేసే మూడేళ్ళలోపు పిల్లలను వారు వినేలాగా "వీళ్లను స్కూల్లో వేస్తేకానీ అల్లరి తగ్గదు" అని పెద్దవాళ్లు అంటుంటారు. ఇలా అనడం వల్ల వారికి తెలియకుండానే స్కూలంటేనే ఒక విధమైన భయాన్ని ఏర్పరుస్తుంది. కాబట్టి, పెద్దలు సాధ్యమైనంతవరకు అలాంటి మాటలకు దూరంగా ఉండాలి.
