ఇంటి పనుల్లో సహాయం
పిల్లల చేత దగ్గరుండి చిన్న చిన్న ఇంటిపనులను చేయించటం మంచిదే. అయితే, ఇలా దగ్గరుండి చేయించటం మంచిదే అయినప్పటికీ, పిల్లల్ని మాత్రం దానికి అలవాటుపడేలా చేయకూడదు. ప్రతిరోజూ దగ్గరుండి చేయించటం వల్ల, వారు పూర్తిగా మీమీదే ఆధారపడేలా తయారవుతారు, సొంతంగా చేసేందుకు ఇష్టపడరు.
