గోళ్ళు కొరకవద్దు
హాయ్ పిల్లలూ..! మీలో చాలా మందికి గోళ్ళు కొరికే అలవాటు ఉండి ఉంటుంది. గోళ్ళలోని మట్టి శరీరంలోకి వెళితే రకరకాల వ్యాధులు కలుగుతాయి. కాబట్టి, మీకు చేతకాకపోయినా సరే, అమ్మానాన్నలను అడిగి శుభ్రంగా కత్తిరించుకోవాలి. వారానికి ఒకసారి గోళ్ళను కత్తిరించుకోవడం తప్పనిసరిగా పాటించాలి. గోళ్ళు శుభ్రంగా ఉంటే, ఆరోగ్యంగా ఉంటారు.
గోళ్ళను ఎప్పటికప్పుడు కత్తిరించుకోవాలి. గోళ్ళను కత్తిరించుకోక పోతే విరిగిపోతాయి. ఒకవేళ కత్తిరించకపోతే వాటిలో మట్టి చేరుతుంది. దీనివల్ల అనారోగ్యం సంభవిస్తుంది. గోరు అడుగుభాగంలో ఉండే తెల్లటి భాగం కనిపించకపోతే, మీరు అనారోగ్యంగా ఉన్నారని అర్థం... కాబట్టి, మీ గోళ్ళను జాగ్రత్తగా కాపాడుకుంటారు కదూ..!