1. ఇతరాలు
  2. »
  3. బాలప్రపంచం
  4. »
  5. చైల్డ్ కేర్

తల్లిపాలు శ్రేష్ఠం

బాల ప్రపంచం చైల్డ్కేర్ బిడ్డకు 6 నెలలు వయస్సు వరకు వారి ఎదుగుదలకు తల్లి పాలు మాత్రమే ఇవ్వాలి తల్లి పాల వలన చాలా ఉపయోగాలు ఉన్నాయని వైద్యులు చెబుతున్నారు
బిడ్డకు 6 నెలలు వయస్సు వరకు వారి ఎదుగుదలకు తల్లి పాలు మాత్రమే ఇవ్వాలి. తల్లి పాల వలన చాలా ఉపయోగాలు ఉన్నాయని వైద్యులు చెబుతున్నారు.

తల్లిపాలు బలవర్ధకమని వీటిని కనీసం ఆరు నెలల వరకు ఇవ్వాలని, వీటి వలన బిడ్డకు కావలసిన పరిమాణంలో పోషక పదార్థాలన్నీ లభిస్తాయని అంటున్నారు వైద్యులు. తల్లిపాలు పిల్లలకు తేలికగా జీర్ణమవుతుంది కూడా.

మొదటి నెలలో బిడ్డకు ఎలాంటి అంటువ్యాధులు రాకుండా వ్యాధి నిరోధక శక్తి తల్లిపాలలో ఉంటుందంటున్నారు వైద్యులు. తల్లి బిడ్డకు పాలివ్వటం వలన తల్లీ-బిడ్డల మధ్య అనుబంధం పెరుగుతుంది.

పిల్లలు పాలను త్రాగటం వలన వారి దవడలు, పళ్ళు, వారి ఎముకల అభివృద్ధికి సహాయపడుతుందంటున్నారు వైద్యులు.