1. ఇతరాలు
  2. »
  3. బాలప్రపంచం
  4. »
  5. చైల్డ్ కేర్

మూడీగా అయిపోతున్నారా...?!

బాలప్రపంచం చైల్డ్ కేర్ పిల్లలు స్కూలు మూడీ టీచర్లు స్నేహితులు ఒత్తిడి హోంవర్క్ తల్లిదండ్రులు
అప్పటిదాకా ఎంతో చురుకుగా ఉన్న పిల్లలు సైతం స్కూలు పేరెత్తగానే మూడీగా మారిపోతుంటారు. ఇక అప్పటిదాకా స్కూలుకు వెళుతున్న పిల్లలైతే ఉన్న స్కూలు నుండి, కొత్త స్కూలుకు మారితే అక్కడి టీచర్లు, స్నేహితులు అంతా కొత్తవాళ్లే కాబట్టి, అలవాటయ్యేదాకా కూడా ఒత్తిడికి గురవుతుంటారు.

ఒకవేళ స్కూలు మార్చకపోయినా, తాము ఎంతగానో అభిమానించిన టీచరు స్థానంలో కొత్త టీచరు రావడం, ఆ టీచరుకు గతంలో ఉన్న టీచరును పోల్చి చూసుకోవడం, ఆ పోలికలు సంతృప్తికరంగా లేకపోవడం లాంటి కారణాల వల్ల కూడా పిల్లలు మూడీగా అయిపోతుంటారు.

అల్లరి చేసినా, హోం వర్కు చెయ్యకపోయినా, చదవక పోయినా ఇదివరకటి టీచరులా కాకుండా, కొత్త టీచర్ కొడతారేమోనన్న బెంగ, భయం కూడా పిల్లల్ని ఒత్తిడికి గురి చేస్తాయి. కాబట్టి... ఈ భయాల నుంచి, ఒత్తిడి నుంచి పిల్లలను బయటపడేసేందుకు టీచర్లు, తల్లిదండ్రులు ప్రయత్నం చేయాలి.
About Writer
Ganesh
contractDetail: Webdunia Chennai.... మరింత చదవండి