1. ఇతరాలు
  2. »
  3. బాలప్రపంచం
  4. »
  5. చైల్డ్ కేర్

హాబీలను అలవర్చండి

బాలప్రపంచం చైల్డ్ కేర్ మనిషి సృజనాత్మకత హాబీ మార్క్ చిన్నారులు తెలివితేటలు స్టాంపులు చెస్ పాటలు పెయింటింగ్
మనిషిలో దాగి ఉండే సృజనాత్మకతను పెంపొందించేందుకు హాబీలు ఉపయోగపడతాయి. హాబీలకు మార్కులుండవు. కానీ అవి మనిషి జీవన విధానంలో మంచి మార్పులను తీసుకొస్తాయి. అందుకే చిన్నారుల తెలివితేటలను మార్కులతో మాత్రమే అంచనా వేయవద్దు. వాళ్లే ఒక మార్క్‌లాగా ఎదిగేలా చూసేవే హాబీలన్న విషయాన్ని గుర్తించాలి..

పిల్లలు ఏదైనా హాబీని పెంచుకుంటే... అది వారి శారీరక ఎదుగుదలతో పాటు, మానసిక ఎదుగుదలకు కూడా బాగా తోడ్పడుతుందని పరిశోధనలలో రుజువైంది. హాబీలంటే స్టాంపుల సేకరణ, చెస్ ఆడటం, పాటలు పాడటం, పెయింటింగ్ చేయడం లాంటి మాత్రమే కాకుండా, పిల్లల ఆసక్తిని పెంచే ఎన్నో రకాల అంశాలు ఉంటాయి.

హాబీలు ఒత్తిడి నుంచి సేద తీరుస్తాయి. విషయ సేకరణను పెంచుతాయి. సంతృప్తిని మిగుల్చుతాయి. ఇది ఇలా చేస్తే బాగుండు అనే ఆలోచనను మొలకొత్తిస్తాయి. చదువులో కాస్త వెనకబడినప్పటికీ... నేను సాధించగలననే ఆత్మవిశ్వాసాన్ని పిల్లల్లో పెంచుతాయి.

కాబట్టి, పిల్లల్లో హాబీలను పెంపొందించి, వారి భావి జీవితాన్ని సుసంపన్నం చేసేలా దారులు వేయాల్సిన బాధ్యత మాత్రం తల్లిదండ్రులదే.
About Writer
Ganesh
contractDetail: Webdunia Chennai.... మరింత చదవండి