శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఐవీఆర్
Last Updated : ఆదివారం, 19 జులై 2020 (22:36 IST)

ఈటెల గారూ... డౌట్ వస్తదని బులిటినే చేంజ్ చేసేసారు గ్రేట్ సర్, ఎవరు?

తెలంగాణలో కరోనావైరస్ కారణంగా ఈరోజు మరణించినవారి సంఖ్య ఆరుగురుగా బులిటిన్ విడుదలయ్యింది. ఐతే ఒక్క నిజమాబాద్ జిల్లాలోనే ఆరుగురు చనిపోతే రాష్ట్రవ్యాప్తంగా ఆరుగురు మాత్రమే ఎలా చనిపోతారూ అంటూ ట్విట్టర్లో ఓ నెటిజన్ పోస్ట్ చేశాడు. 
 
కస్తూరి వినయ్ అనే నెటిజన్.. ''ఈ రోజు నిజామాబాద్ లో ఆరుగురు చనిపోయారని చెప్పి తర్వాత ఇద్దరు మాత్రమే కరోనా తో చనిపోయారని రెండో సారి చెప్పారు ఎందుకంటే మన ప్రభుత్వం తెలంగాణ బులిటెన్ లో ఈ రోజు ఆరు మరణాలు ఇచ్చారు . ఒక్క నిజామాబాద్ లొనే 6గురు ఇస్తే doubt వస్తదని నిజామాబాద్ బులిటెన్ చేంజ్ చేశారు గ్రేట్ సర్.'' అంటూ ట్వీట్ చేశాడు. మరి ఇందులో ఏది నిజమో?