1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
  4. AP reports a record 3963 covid 19 cases and 52 more deaths on saturday

ఏపీలో కరోనావైరస్ బీభత్సం, ఒక్కరోజే 3,963 కేసులు నమోదు

కోవిడ్ 19
ఏపీ కరోనావైరస్ కేసుల విషయంలో పొరుగు రాష్ట్రం తమిళనాడుతో పోటీపడుతున్నట్లు కనిపిస్తోంది. ఒక్కసారిగా ఇక్కడ కరోనా వైరస్ బీభత్సం సృష్టిస్తోంది. గడచిన 24 గంటల్లో 52 మంది మృత్యువాత పడగా కేసుల సంఖ్య ఒకేసారి 3,963గా నమోదయ్యాయి. దీనితో అధికారులు అప్రమత్తమయ్యారు.
 
కాగా కరోనావైరస్ కారణంగా చనిపోయిన వారిలో అత్యధికంగా తూర్పు గోదావరి జిల్లాలో 12 మంది, గుంటూరు జిల్లాలో 8 మంది, కృష్ణా జిల్లాలో 8 మంది, అనంతపురం జిల్లాలో ఏడుగురు, పశ్చిమ గోదావరి జిల్లాలో ఐదుగురు, ప్రకాశం జిల్లాలో నలుగురు, నెల్లూరు జిల్లాలో ముగ్గురు, విశాఖపట్నం జిల్లాలో ఇద్దరు, చిత్తూరు జిల్లాలో ఒకరు, కడప జిల్లాలో ఒకరు, విజయనగరం జిల్లాలో ఒకరు మరణించారు.
 
రాష్ట్రంలో తూర్పుగోదావరి జిల్లాలోనే 994 మందికి పాజిటివ్ కేసులు గత 24 గంటల్లో నమోదయ్యాయి. ఇవాళ మొత్తం 3963 నమోదైన కేసులతో కలుపుకుని రాష్ట్ర వ్యాప్తంగా పాజిటివ్ కేసుల సంఖ్య 44,609కి చేరాయి. వీరిలో ప్రస్తుతం 22,260 మంది చికిత్స పొందుతున్నారు.
About Writer
ఐవీఆర్
తర్వాతి కథనం
అమరావతిపై చంద్రబాబుది కపట ప్రేమ: మంత్రి కురసాల కన్నబాబు