శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 17 జులై 2020 (11:19 IST)

ఇంత కన్నా నేను ఏమి చెప్పలేను.. అమితాబ్‌ ట్వీట్

ప్రపంచ దేశాలను కరోనా వైరస్ అట్టుడికిస్తోంది. కరోనా వైరస్ పేద, ధనికా తేడా లేకుండా కాటేస్తోంది. ఇప్పటికే పలువురు సెలెబ్రిటీలు కరోనా బారిన పడ్డారు. ఇప్పటికే అమితాబ్‌తో పాటు అభిషేక్ బచ్చన్, ఐశ్వర్యరాయ్, ఆరాధ్య కూడా కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. ఇలా కరోనా బారిన పడిన అమితాబ్ బచ్చన్ ప్రస్తుతం నానావతి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. 
 
అమితాబ్ ఆరోగ్యం నిలకడగా ఉందని, సాధారణ వైద్యం అందిస్తున్నామని వైద్యులు చెప్తున్నారు. అయితే తనని కంటికి రెప్పలా కాపాడుతున్న వైద్యులకి సోషల్ మీడియా ద్వారా కృతజ్ఞతలు తెలియజేసిన బిగ్ బీ, తాజాగా తన ఆరోగ్యంపై అప్‌డేట్ ఇచ్చారు.
 
"మా ఆరోగ్యం గురించి వాకబు చేస్తూ తమపై కురిపిస్తున్న ప్రేమ, ఆశీర్వాదం, ప్రార్థనలు అన్నీ చూశానని తెలిపారు. అమితమైన ప్రేమకి తన కృతజ్ఞతలు. ఆస్పత్రిలో చాలా రూల్స్ కఠినంగా ఉన్నాయి. ఇవి అన్నీ కూడా మా ఆరోగ్యం కోసమే. ఇంత కన్నా నేను ఏమి చెప్పలేను .. ప్రేమతో..." అంటూ అమితాబ్ తన ట్విట్టర్‌లో పేర్కొన్నారు.