శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 12 జులై 2020 (11:20 IST)

"అమితాబ్ ఓ యోధుడు"... మీరు త్వరగా కోలుకోవాలి : చిరంజీవి - నాగార్జున

బాలీవుడ్ దిగ్గజ నటుడు అమితాబ్ బ‌చ్చ‌న్‌కు క‌రోనా సోకింది. ఆయన కుమారుడు అభిషేక్ బచ్చన్‌కు కూడా ఈ వైరస్ బారినపడ్డారు. ప్రస్తుతం వీరిద్దరూ ముంబై నానావతి సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే, అమితాబ్‌కు కరోనా సోకిందన్న విషయం తెలిసిన తర్వాత ఆయన త్వరగా కోలుకోవాలని కోరుకుంటూ ప్రధాని నరేంద్ర మోడీతో పాటు.. పలువురు సినీ సెలెబ్రిటీలు ట్వీట్లు చేస్తున్నారు.
 
"అమితాబ్ ఓ యోధుడు... ఆయన త్వరగా కోలుకుని బయటకు వస్తారు" అని ప్రధాని నరేంద్ర మోడీ ఆకాంక్షించారు. ఆయన త్వరగా కోలుకోవాలని సచిన్, యువరాజ్ తదితరులు ట్వీట్ చేశారు. ఆయనకు కరోనా సోకడం తనకు దిగ్భ్రాంతిని కలిగించిందని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వ్యాఖ్యానించారు.  
 
'మీరు త్వరగా కోలుకోవాలని మేమంతా కోరుకుంటున్నాము అమిత్‌ జీ' అంటూ మెగాస్టార్ చిరంజీవి ట్వీట్ చేశారు. 'డియర్‌ అమిత్‌ జీ.. మీరు త్వరగా కోలుకోవాలని మేము ప్రార్థిస్తున్నాము' అని అక్కినేని నాగార్జున తెలిపారు.
 
అలాగే, మ‌హేశ్ బాబు‌, ర‌వితేజ‌, రాశీఖ‌న్నా, తాప్సీ, ప్రియ‌మ‌ణి, నిత్యామీన‌న్‌తో పాటు పలువురు అమితాబ్ బచ్చన్‌ త్వ‌ర‌గా కోలుకోవాల‌ని ప్రార్థిస్తున్నామ‌ని పేర్కొన్నారు. 
 
అమితాబ్‌ బచ్చన్ త్వరలోనే కోలుకుని తిరిగి ఆరోగ్యవంతంగా కనపడతారని ఆకాంక్షిస్తున్నట్లు బాలీవుడ్ నటులు మాధురీ దీక్షిత్, సోనం కపూర్, షాహిద్‌ కపూర్, రితీష్ దేశ్‌ముఖ్‌తో పాటు పలువురు ట్వీట్లు చేశారు.