సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ఐవీఆర్
Last Updated : శనివారం, 11 జులై 2020 (23:08 IST)

నాకు కరోనావైరస్ పాజిటివ్, నానావతి ఆసుపత్రిలో చేరా: బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్

బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ శనివారం సాయంత్రం ముంబైలోని నానావతి ఆసుపత్రిలో చేరారు. ఆయన తన ట్విట్టర్లో ట్వీట్ చేస్తూ తనకు కోవిడ్ 19 అని తేలిందని, అందుకే ఆసుపత్రిలో చేరినట్లు వెల్లడించారు.

తన కుటుంబ సభ్యులకు కూడా కరోనావైరస్ పరీక్షలు చేస్తున్నారని వెల్లడించారు. బాలీవుడ్‌కు చెందిన 77 ఏళ్ల బిగ్ బి ప్రస్తుతం రణబీర్ కపూర్, అలియా భట్ నటించిన బ్రహ్మాస్త్రా చిత్రంలో నటిస్తున్నారు.
 
బచ్చన్ 12వ ఎడిషన్ పాపులర్ గేమ్ షో కౌన్ బనేగా క్రోరోపతి(కెబిసి)లో కూడా పనిచేస్తున్నారు. ఐతే సీనియర్ సిటిజన్లకు ప్రభుత్వం కోవిడ్ -19 లాక్డౌన్ నిబంధనల కారణంగా, తిరిగి షూటింగులో పాల్గొనలేకపోయాడు. కాగా బిగ్ బి పూర్తి ఆరోగ్యంతో కోలుకోవాలని ఆయన అభిమానులు కోరుతున్నారు.