శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 12 జులై 2020 (09:40 IST)

బాలీవుడ్ నటి రేఖ ఇంటికి సీలు వేసిన ముంబై మున్సిపల్ అధికారు.. కారణం?

దేశంలో కరోనా వైరస్ శరవేగంగా వ్యాపిస్తోంది. ముఖ్యంగా, ముంబై మహానగరంలో ఈ వైరస్ వ్యాప్తి విశ్వరూపం దాల్చింది. ఫలితంగా ప్రతి రోజూ వేలాది మంది ఈ వైరస్ బారినపడుతున్నారు. తాజాగా బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్, ఆయన కుమారుడు అభిషేక్ బచ్చన్‌కు కరోనా పాజిటివ్ అని తేలింది. ఈ క్రమంలో బాలీవుడ్ సీనియర్ నటి రేఖ ఇంటివద్ద పని చేసే ఓ సెక్యూరిటీ గార్డుకు ఈ వైరస్ సోకింది. దీంతో రేఖ నివసించే బంగళాకు ముంబై మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు సీలు వేశారు. 
 
రేఖ ఇంటి ముందు తలుపుకు కూడా మున్సిపల్ అధికారులు ఓ బ్యానర్ కట్టి... కంటైన్మెంట్ జోనుగా ప్రటించారు. అలాగే, ఈ ఇంటి రేఖ కూడా తన మకాం మార్చారు. ముంబై, బంద్రాలోని బన్‌స్టాండ్ ఏరియాలో ఉన్న ఇంటికి షిఫ్ట్ అయ్యారు. రేఖ నివసించే ఇంటితో పాటు.. సెక్యూరిటీ గార్డు నివసించిన ఇంటిని మున్సిపల్ అధికారులు శానిటైజ్ చేశారు. అయితే, ఈ వ్యవహారంపై రేఖ వ్యక్తిగత ప్రతినిధి వైపు నుంచి ఎలాంటి సమాచారం లేకపోవడం గమనార్హం.