1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
  4. Corona virus kits to home, Telangana govt plan to distribution

ఇంటికే కరోనా కిట్, తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం

Corona virus kits
కరోనా వైరస్ కేసులు పెరుగుతుండటంతో తెలంగాణ సర్కారు కీలక నిర్ణయం తీసుకున్నది. ఇంటిలోనే ఉండి చికిత్స పొందుతున్న కరోనా బాధితుల వద్దకే ఐసోలేషన్ కిట్టు పంపాలని నిర్ణయించింది. ఆ సమయంలో చికిత్సకు అవసరమైన ఔషధాలు, మాస్క్‌లు, శానిటైజర్లను సర్కారే ఉచితంగా అందించనుంది.
 
హైదరాబాదు కోఠిలోని ఆరోగ్య కార్యాలయంలో వైద్యఆరోగ్యశాఖ మంత్రి ఈటెల రాజేందర్ శుక్రవారం ఉన్నతాధికారులతో నిర్వహించిన సమా వేశంలో ఈ మేరకు కీలక నిర్ణయం తీసుకున్నారు. సాధ్యమైనంత త్వరగా బాధితులకు కిట్లను అందజేయాలని ఆదేశాలు జారీచేశారు.
 
ప్రస్తుతం తెలంగాణలో మొత్తం కేసుల సంఖ్య 32,224గా ఉండగా ఇందులో 12,860 యాక్టివ్ కేసులు ఉన్నాయి. వీరిలో దాదాపు 10 వేల మంది ఇళ్ల నుండే చికిత్స పొందుతున్నారు.
 
కిట్‌లో గల పరికరాలు:-
1. శానిటైజర్లు, మాస్క్‌లు, గ్లౌజులు.
2. హైడ్రాక్సీక్లోరోక్సిన్.
3. పారాసెటమల్.
4. యాంటీబయాటిక్స్.
5. విటమిన్ సి, ఇ, డి3 తదితరాలు.
6. లివోసెటిరిజైన్
7. ఎసిడిటీని తగ్గించే మాత్రలు.
8. ఏం చేయాలి, ఏం చేయకూడదు? అని అవగాహన పెంపొందించే పుస్తకం.
About Writer
వి
తర్వాతి కథనం
జమ్మూకాశ్మీర్‌లో ఉగ్రవాదుల హతం.. ఏకే 47, ఆయుధాలు స్వాధీనం