శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By శ్రీ
Last Modified: శుక్రవారం, 10 జులై 2020 (22:42 IST)

కర్నాటక సీఎం యడియూరప్ప వర్క్ ఫ్రమ్ హోం

కరోనా విజృంభిస్తున్న తరుణంలో వర్క్ ఎట్ హోంకు అత్యంత ప్రాధాన్యత ఏర్పడింది. ఇప్పుడు ముఖ్యమంత్రులు కూడా ఇంటి నుంచే పరిపాలన చెయ్యాల్సిన పరిస్ధితులు ఏర్పడుతున్నాయి. కర్ణాటక బెంగళూరులో సిఎం కార్యాలయంలో అధికారులకు కరోనా పరీక్షల నేపద్యంలో ముఖ్యమంత్రి యడియురప్ప కీలక నిర్ణయం తీసుకున్నారు.
 
ముందస్తు చర్యల్లో బాగంగా ఇంటి నుంచి విధులు నిర్వర్తించేలా తీసుకున్న నిర్ణయాన్ని ప్రకటించారు. కరోనా వైరస్ వ్యాప్తి నేపద్యంలో అధికారులకు కూడా కరోనా పరీక్షలు నిర్వహించేలా తగిన చర్యలు తీసుకున్నారు. ఈ క్రమంలో కొద్ది రోజులు పాటు ఇంటి నుంచే తమ కార్యకలాపాలు కొనసాగుతాయని చెప్పారు.
 
ఆన్‌లైన్‌లో అవసరమైన ఆదేశాలు, సూచనలు ఇస్తామని చెప్పారు. తాను ఆరోగ్యంగా ఉన్నానని చెప్పిన యడియురప్ప ప్రజలను భయపడవద్దని సూచించారు. కరోనా వైరస్ వ్యాప్తిని నియంత్రించేందుకు సూచించిన మార్గదర్శకాలను పాటించాలని ముఖ్యమంత్రి ప్రజలను కోరారు