రెండురోజులకే సంచలనం నిర్ణయం తీసుకున్న కర్ణాటక సిఎం.. ఏంటది?

జె| Last Modified బుధవారం, 31 జులై 2019 (17:52 IST)
ముఖ్యమంత్రిగా ప్రమాణం స్వీకారం చేసిన రెండురోజులకే సంచలన నిర్ణయం తీసుకున్నారు యడ్యూరప్ప. టిప్పుసుల్తాన్ జయంతి వేడుకలను రద్దు చేస్తూ అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. నవంబర్ 10వ తేదీన టిప్పుసుల్తాన్ జయంతి వేడుకలను అధికారికంగా నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది.

అయితే ఈ జయంతి వేడుకలను బిజెపి ముందు నుంచి వ్యతిరేకిస్తూ వస్తోంది. కర్ణాటకలో టిప్పు జయంతి రోజులు తీవ్ర ఉద్రిక్తతలకు కారణమవుతున్నాయని అంటోంది బిజెపి. అందుకే రద్దు చేస్తున్నట్లు వివరణ ఇచ్చింది. 2016 నుంచి టిప్పు జయంతి వేడుకలను అధికారికంగా నిర్వహిస్తున్నారు.

గత యేడాది టిప్పు జయంతి వేడుకల సంధర్భంగా తీవ్ర ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. అయినప్పటికీ పట్టుబట్టి మరీ వేడుకలను నిర్వహించారు అప్పటి సిఎం సిద్ధరామయ్య. టిప్పు సుల్తాన్ విషయంలో తమకు చాలా అభ్యంతరాలు ఉన్నాయంటున్నారు యడ్యూరప్ప. అయితే బ్రిటీష్ వారితో పోరాడి ప్రాణత్యాగం చేసిన టిప్పు సుల్తాన్‌కు ఇలా మతం రంగు పులమడం మంచిది కాదంటున్నారు కాంగ్రెస్, జెడిఎస్ నేతలు.దీనిపై మరింత చదవండి :