1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
  4. Shankar sensational decision on Bharateeyudu 2

గ్రేట్ డైరెక్ట‌ర్ శంక‌ర్ సంచ‌ల‌న నిర్ణ‌యం..!

Shankar
గ్రేట్ డైరెక్ట‌ర్ శంక‌ర్ సినిమా ఎంత భారీ స్ధాయిలో ఉంటుందో ప్రత్యేకించి చెప్ప‌న‌వ‌స‌రం లేదు. తాజా చిత్రం 2.0 దాదాపు 550 కోట్ల భారీ బ‌డ్జెట్‌తో రూపొందించారు. రికార్డు స్ధాయి క‌లెక్ష‌న్స్‌తో 2.0 దూసుకెళుతోంది. ఈ సినిమా త‌ర్వాత శంక‌ర్ భార‌తీయుడు 2 తెర‌కెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నారు. క‌మ‌ల్ హాస‌న్ న‌టించే ఈ సినిమా త్వ‌ర‌లో సెట్స్ పైకి వెళ్లేందుకు రెడీ అవుతోంది. ఇదిలా ఉంటే... శంక‌ర్ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నార‌ట‌.
 
ఇంత‌కీ విష‌యం ఏంటంటే.. బారతీయుడు 2 సినిమాలో గ్రాఫిక్స్‌ని నమ్ముకోవట్లేదట‌. గ్రాఫిక్స్ లేకుండా సినిమా తీయాల‌నుకుంటున్నాడ‌ట‌.   భారతీయుడులో లాగే ఇందులో సమాజంలో పేరుకుపోయిన అవినీతి మీద కథ నడుస్తుందట‌. కాకపోతే భారతీయుడు ఈ కాలంలో ఉన్న టెక్నాలజీ ఎలా వాడుకుంటాడు, పోలీసులకు ఇంకెంత సవాల్ విసురుతాడు అన్న అంశాలు అదనంగా ఉండబోతున్నాయంట. మ‌రి.. ఈ సినిమాతో ఎలాంటి సెన్సేష‌న్ క్రియేట్ చేస్తాడో చూడాలి.
About Writer
శ్రీ
తర్వాతి కథనం
జయలలిత బయోపిక్.. ఐరన్ లేడీగా నిత్యామీనన్ పోస్టర్లో అదిరిపోయింది..