బుధవారం, 8 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : ఆదివారం, 2 డిశెంబరు 2018 (15:03 IST)

కలెక్షన్ల వర్షం కురిపిస్తున్న '2.O'... 'సర్కార్' రికార్డు మాయం

ఎస్. శంకర్ దర్శకత్వంలో సూపర్ స్టార్ రజనీకాంత్, బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్‌లు నటించిన చిత్రం 2.O. నవంబరు 29వ తేదీన విడుదలైన  ఈచిత్రం సూపర్ హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. దీంతో కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. తొలి రెండు రోజుల్లోనే రూ.111 కోట్ల మేరకు కలెక్షన్లు రాబట్టింది. ఇందులో తమిళం, తెలుగు వర్షెన్లకు చెందిన వసూళ్ళను కలపలేదు. 
 
ఈ చిత్రం తొలి రోజున రూ.73.5 కోట్లు ఆర్జించింది. అయితే రెండో రోజు కేవలం హిందీలోనే రూ.38.25 కోట్లు రాబట్టింది. దీంతో రెండో రోజు కలెక్షన్లు రూ.111.5 కోట్లకు చేరుకున్నది. ఈ కలెక్షన్లకు తమిళ, తెలుగు వర్షెన్ల వసూళ్లను కలపలేదు. 
 
ఈ విషయాన్ని ట్రేడ్‌ అనలిస్ట్‌ తరణ్‌ ఆదర్శ్‌ తన ట్విట్టర్‌లో ఈ విషయాన్ని వెల్లడించారు. ఓవర్‌సీస్‌లోనూ 2.0 ఫిల్మ్‌ మెరుగైన కలెక్షన్లను రాబట్టుతోంది. యూఎస్‌లో మొదటి రోజు 2.05 కోట్లు వసూల్‌ చేసింది. ఆస్ట్రేలియాలో 58.46 లక్షలు, న్యూజిలాండ్‌లో 11.11 లక్షలు వసూలయ్యాయి. రోబోకు సీక్వెల్‌గా వచ్చిన 2.0 సైన్స్‌ థ్రిల్లర్‌ను శంకర్‌ డైరక్ట్‌ చేశాడు. 543 కోట్ల బడ్జెట్‌తో ఈ సినిమాను తెరకెక్కించారు.