గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు 2018
Written By
Last Updated : ఆదివారం, 2 డిశెంబరు 2018 (10:27 IST)

పంతం నెగ్గింది... రేవంత్ రెడ్డికి 4+4 భద్రత - 2 ఎస్కార్ట్ వాహనాలు

తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ వర్కిగ్ ప్రెసిడెంట్ అనుమోలు రేవంత్ రెడ్డి తన పంతాన్ని నెగ్గించుకున్నారు. తనకు ప్రాణహాని ఉందని, భద్రత కల్పించాలంటూ న్యాయపోరాటం చేసి విజయం సాధించాడు. హైకోర్టు డివిజన్ బెంచ్ ఆదేశం మేరకు ఆయనకు 2 ఎస్కార్ట్ వాహనాలతో పాటు 4+4 గన్‌మెన్లను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. అయితే, ఈ భద్రత తెలంగాణ శాసనసభ ఎన్నికల ఫలితాలు వెల్లడయ్యేంత వరకు మాత్రమే కొనసాగుతుంది. 
 
తన ప్రాణాలకు ముప్పు ఉందంటూ రేవంత్‌ రెండు రోజులుగా తన ఎన్నికల ప్రచారాన్ని వాయిదా వేసుకున్న విషయం తెల్సిందే. తనకు ప్రాణ హాని ఉందని, భద్రత కల్పించాలంటూ రేవంత్‌ రెడ్డి కొద్ది రోజుల క్రితం హైకోర్టును ఆశ్రయిం చారు. పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన హైకోర్టు సింగిల్‌ జడ్జి బెంచ్‌ రేవంత్‌కు భద్రత కల్పించాలని కేంద్రాన్ని ఆదేశించారు. ఈ ఆదేశాలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించలేదు. 
 
దీంతో రేవంత్ డివిజన్ బెంచ్‌ను ఆశ్రయించారు. ఫలితంగా హైకోర్టులో కేంద్ర హోం శాఖ అప్పీల్‌‌కు చేసింది. స్థానిక నేతలకు భద్రత కల్పించాల్సింది రాష్ట్ర ప్రభుత్వాలని హైకోర్టు డివిజన్ బెంచ్ దృష్టికి తీసుకెళ్లింది. సింగిల్‌ జడ్జి బెంచ్‌ ఇచ్చిన తీర్పును సవరించాలని కోరింది. కేంద్ర హోంశాఖ అప్పీల్‌పై విచారణ జరిపిన డివిజన్‌ బెంచ్‌.. రేవంత్‌ రెడ్డికి రాష్ట్ర ప్రభుత్వమే భద్రత కల్పించాలని ఆదేశించింది. 4+4 భద్రతోపాటు ఎస్కార్ట్‌ ఉండాలని సూచించింది.