మంగళవారం, 16 ఏప్రియల్ 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By రామన్
Last Modified: శనివారం, 1 డిశెంబరు 2018 (17:30 IST)

02-12-2018 నుంచి 08-12-2018 వరకూ మీ వార రాశి ఫలితాలు(Video)

కర్కాటకంలో రాహువు, తులలో శుక్రుడు, వృశ్చికంలో రవి, గురువు, వక్రి బుధులు, ధనస్సులో శని, మకరంలో కేతువు, కుంభంలో కుజుడు. కన్య, తుల, వృశ్చిక, ధనస్సులలో చంద్రుడు. 3న సర్వ ఏకాదశి, 5న మాస శివరాత్రి, 8న పోలిస్వర్గం. 6న బుధుని వక్రత్యాగం. 
 
మేషం: అశ్వని, భరణి, కృత్తిక 1వ పాదం
ఆర్థికస్థితి నిరాశాజనకం. అవకాశాలు కలిసిరాక నిరుత్సాహం చెందుతారు. ఊహించని ఖర్చులుంటాయి. రుణం కోసం యత్నాలు సాగిస్తారు. ఆలోచనలు నిలకడగా ఉండవు. సంప్రదింపులు వాయిదా పడుతాయి. ఆరోగ్యం జాగ్రత్త. పనులు మెుండిగా పూర్తిచేస్తారు. ఒక ఆహ్వానం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఆది, గురు, వారాల్లో అనుకోని సంఘటనలెదురవుతాయి. దంపతుల మధ్య అవగాహన లోపం. పంతాలకు పోవద్దు. గృహ ప్రశాంతతకు భంగం కలుగుకుండా వ్యవహరించాలి. ఆత్మీయుల హితవు మీపై చక్కని ప్రభావం చూపుతుంది. ప్రముఖులను కలుసుకుంటారు. వ్యాపకాలు, పరిచయాలి విస్తరిస్తాయి. వ్యాపారాభివృద్ధికి మరింత శ్రమించాలి. నూతన వ్యాపారులకు సమయం కాదు. ఉద్యోగస్తులకు కొత్త సమస్యలెదురవుతాయి. వృత్తుల వారికి సామాన్యం. 
 
వృషభం: కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2 పాదాలు
లక్ష్యసాధనకు ఓర్పు ప్రధానం. ప్రతికూల పరిస్థితులెదుర్కుంటారు. ఖర్చులు విపరీతం. ధనసహాయం అర్ధించి భంగపడుతారు. అవసరాలు నెరవేరవు. మంగళ, శని వారాల్లో పనులు సాగవు. సన్నిహితుల కలయికతో కుదుటపడుతారు. పట్టుదలతో యత్నాలు సాగించండి. మీ కృషి త్వరలో ఫలిస్తుంది. సంతానం భవిష్యత్తుపై శ్రద్ధ అవసరం. గృహమార్పు నిదానంగా ఫలితమిస్తుంది. చిన్ననాటి పరిచయస్తులను కలుసుకుంటారు. గత అనుభవాలు జ్ఞప్తికొస్తాయి. వృత్తి ఉపాధి పథకాల్లో నిలదొక్కుకుంటారు. వ్యాపారాలు వస్త్ర, ఫ్యాన్సీ వ్యాపారాలు ఊపందుకుంటాయి. ఆకర్షణీయమైన పథకాలు అమలుచేస్తారు. ఉద్యోగస్తులకు యూనియన్ వ్యవహారాలతో తీరిక ఉండదు. అధికారులకు ఒత్తిడి, పనిభారం సన్మాన, సాహిత్య సభల్లో పాల్గొంటారు. వాహనం నడిపేటపుడు జాగ్రత్త. 
 
మిథునం: మృగశిర 3, 4 పాదాలు, ఆర్ధ్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
కొత్త వ్యాపకాలు సృష్టించుకుంటారు. ఒక సమాచారం ఆలోచింపచేస్తుంది. నగదు, పత్రాలు జాగ్రత్త. బాధ్యతలు స్వయంగా చూసుకోవాలి. గురు, శుక్ర వారాల్లో దుబారా ఖర్చులు విపరీతం. ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. గృహ మరమ్మత్తులు చేపడతారు. దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. వేడుకలకు సన్నాహాలు సాగిస్తారు. గృహంలో సందడి నెలకొంటుంది. బంధుత్వాలు బలపడుతాయి. ఆదాయ వ్యయాలు సంతృప్తికరం. డబ్బుకు ఇబ్బంది ఉండదు. పనులు హడావుడిగా సాగుతాయి. ఉద్యోగ బాధ్యతల్లో ఏకాగ్రత వహించండి. యాదృచ్ఛికంగా తప్పులు దొర్లే ఆస్కారం ఉంది. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. కంప్యూటర్, ప్రింటింగ్ రంగాల వారికి పనిభారం. విదేశాల నుండి సంతానం రాక సంతోషాన్నిస్తుంది. బెట్టింగ్‌లు, జూదాల జోలికి పోవద్దు.  
 
కర్కాటకం: పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
ప్రేమానుబంధాలు బలపడుతాయి. ఖర్చులు అధికం, ప్రయోజనకరం. ఆశలొదిలేసుకున్న బాకీలు వసూలు కాగలవు. ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. వ్యవహారానుకూలత ఉంది. కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. పనులు ప్రారంభంలో ఆటంకాలెదరవుతాయి. పరిచయస్తుల రాక ఇబ్బంది కలిగిస్తుంది. నోటీసులు, కీలక పత్రాలు అందుకుంటారు. ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. అనవసర విషయాలకు దూరంగా ఉండాలి. శనివారం నాడు బాధ్యతలు స్వయంగా చూసుకోవాలి. సోదరులతో సంప్రదింపులు జరుపుతారు. మీ మాటతీరును అదుపులో ఉంచుకోండి. ఎవరినీ నిందించవద్దు. వృత్తి వ్యాపారాల్లో రాణింపు, అనభవం గడిస్తారు. నిరుద్యోగులకు ఉద్యోగయోగం. అధికారులకు ఒత్తిడి, ఆందోళన. వేడుకలకు సన్నాహాలు సాగిస్తారు.    
 
సింహం: మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
సంతోషకరమైన వార్తలు వింటారు. కొత్త పరిచయాలేర్పడుతాయి. మీ మాటతీరు ఆకట్టుకుంటుంది. వ్యతిరేకులు సన్నిహితులవుతారు. గృహం ప్రశాంతంగా ఉంటుంది. ఖర్చులు విపరీతం. చేతిలో ధనం నిలబడదు. సన్నిహితుల కోసం బాగా వ్యయం చేస్తారు. పనులు హడావుడిగా సాగుతాయి. పోగొట్టుకున్న పత్రాలు, వస్తువులు తిరిగి సంపాదిస్తారు. ఆరోగ్యం మందగిస్తుంది. విశ్రాంతి అవసరం. మీ శ్రీమతి వైఖరి అసహానం కలిగిస్తుంది. ఆత్మీయులను కలుసుకుంటారు. సంతానం అత్యుత్సాహాన్ని అదుపు చేయండి. దైవదీక్షలు, సభ్యత్వాలు స్వీకరిస్తారు. వస్త్ర, ఫ్యాన్సీ, పచారీ వ్యాపారులకు ఆదాయాభివృద్ధి. చిరువ్యాపారులకు సామాన్యం. న్యాయ, వైద్య సాంకేతిక రంగాల వారికి ఆశాజనకం. ఉద్యోగస్తులకు ఒత్తిడి, పనిభారం. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలిసివస్తాయి. 
 
కన్య: ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
ఈ వారం సంప్రదింపులకు అనుకూలం. వ్యవహారాలతో హడావుడిగా ఉంటారు. ధనలాభం ఉంది. ప్రేమానుబంధాలు బలపడుతాయి. శుభకార్యానికి సన్నాహాలు సాగిస్తారు. అర్ధాంతంగా నిలిపివేసిన పనులు పూర్తికాగలవు. ఖర్చులు విపరీతం. నగడు డ్రా చేసేటపుడు జాగ్రత్త. అపరిచితుల సాయం ఆశించవద్దు. గృహమార్పు అనివార్యం. సంతానం భవిష్యత్తు గురించి ఆలోచిస్తారు. నష్టాలు, ఆటంకాలను దీటుగా ఎదుర్కుంటారు. షాపుల స్థల మార్పు కలిగివస్తుంది. అధికారులకు కొత్త బాధ్యతలు, పనిభారం. నిరుద్యోగులకు ఉపాధి శిక్షణ అవకాశం లభిస్తుంది. వృత్తుల వారికి ప్రజా సంబంధాలు బలపడుతాయి. తీర్ధయాత్రలకు సన్నాహాలు సాగిస్తారు.     
 
తుల: చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
వేడుకలు, శుభకార్యంపై దృష్టి పెడతారు. సంప్రదింపులు ఫలిస్తాయి. చక్కని నిర్ణయాలు తీసుకుంటారు. కొంత మెుత్తం ధనం అందుతుంది. ఖర్చులు విపరీతం. ఆది, సోమ వారాల్లో చెల్లింపుల్లో జాగ్రత్త. పనులు సానుకూలమవుతాయి. చేతిలో ధనం నిలవదు. బంధువులతో ఉల్లాసంగా గడుపుతారు. నగదు, విలువైన వస్తువులు జాగ్రత్త. అపరిచితులతో మితంగా సంభాషించండి. అనవసర జోక్యం తగదు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. నిర్మాణాలు, మరమ్మత్తులు చేపడతారు. గృహమార్పు సత్ఫలితాలిస్తాయి. ఊహించని సంఘటనలెదురవుతాయి. కొత్త విషయాలపై దృష్టి పెడతారు. వ్యాపారాలు ఊపందుకుంటాయి. షాపుల అలంకరణతో కొనుగోలుదార్లను ఆకట్టుకుంటారు. ఉద్యోగస్తులకు బాధ్యతల నుండి ఉపశమనం లభిస్తుంది. పందాలు, పోటీల్లో పాల్గొంటారు.    
 
వృశ్చికం: విశాఖ 4వ పాదం, అనురాధ, జ్యేష్ట
వ్యవహారాలు స్వయంగా చూసుకోవాలి. పనులు మెుండిగా పూర్తిచేస్తారు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. ఖర్చులు అంచనాలను మించుతాయి. రాబడిపై దృష్టి పెడతారు. స్థిరాస్తి విక్రయంలో పునరాలోచన అవసరం. మనోధైర్యంతో యత్నాలు సాగించండి. మంగళ, బుధ వారాల్లో మంచికి పోతే చేడు ఎదురవుతుంది. శకునాలు, విమర్శలు పట్టించుకోవద్దు. మీ శ్రీమతి సలహా పాటించండి. సన్నిహితులను కలుసుకుంటారు. ఒక సమాచారం ఉపశమనం కలిగిస్తుంది. ఆహ్వానాలు అందుతాయి. సంతానం విషయంలో శుభపరిణామాలు సంభవం. సోదరుల మధ్య కొత్త విషయాలు చర్చకు వస్తాయి. న్యాయ నిపుణులలతో సంప్రదింపులు జరుపుతారు. వ్యాపారాలు ఊపందుకుంటాయి. నష్టాలను భర్తీ చేసుకుంటారు. అధికారులకు హోదా మార్పు, ఆకస్మిక స్థానచలనం. 
 
ధనస్సు: మూల, పూర్వాషాడ, ఉత్తరాషాడ 1వ పాదం
ఆదాయ వ్యయాలకు పొంతన ఉండదు. పొదుపు మూలక ధనం గ్రహిస్తారు. చెల్లింపులు, నగదు స్వీకరణలో జాగ్రత్త. అవకాశాలను వదులుకోవద్దు. పరిస్థితులకు అనుగుణంగా వ్యవహరించాలి. ఎదుటివారి ఆంతర్యం గ్రహించండి. గురు, శుక్ర వారాల్లో పనులు సాగవు. దూరపు బంధువులు ఆహ్వానం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఇతరుల విషయాలు తెలుసుకోవాలన్న ఆసక్తి తగదు. మీ గౌరవానికి భంగం కలిగే ఆస్కారం ఉంది. పెద్దలతో సంప్రదింపులు జరుపుతారు. ఆరోగ్యం పర్వాలేదనిపిస్తుంది. ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుంటారు. ఉద్యోగస్తులకు పనిభారం, విశ్రాంతి లోపం. ఆశావహ దృక్పధంతో ఉద్యోగయత్నం సాగించండి. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. దైవకార్యాల్లో పాల్గొంటారు. వాహనం నడిపేటపుడు జాగ్రత్త. జూదాలకు దూరంగా ఉండాలి.  
 
 
మకరం: ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
సభ్యత్వాలు, దైవదీక్షలు స్వీకరిస్తారు. పరిచయాలు బలపడుతాయి. ఖర్చులు విపరీతం. విలాసాలకు బాగా వ్యయం చేస్తారు. కొత్త వ్యాపకాలు సృష్టించుకుంటారు. యత్నాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. మీ ప్రమేయంతో శుభకార్యం నిశ్చయమవుతుంది. బంధుమిత్రులతో సత్సంబంధాలు నెలకొంటాయి. స్వల్ప అస్వస్థతకు గురవుతారు. విశ్రాంతి అవసరం. దంపతుల మధ్య సఖ్యత నెలకొంటుంది. శనివారం నాడు పనులు హడావుడిగా సాగుతాయి. అవివాహితులకు శుభవార్తా శ్రవణం. చిన్ననాటి పరిచయస్తులు తారసపడతారు. ఉద్యోగస్తుల సమర్థత అధికారులకే లాభిస్తుంది. సహోద్యోగులతో విందులు, వినోదాల్లో పాల్గొంటారు. మీ బలహీనతలు అదుపులో ఉంచుకోండి. వ్యాపారాల్లో ఆశించిన లాభాలు గడిస్తారు. పెట్టుబడులు, వ్యాపారాల విస్తరణలకు అనుకూల సమయం.  
 
కుంభం: ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
వ్యవహారాలను సమర్థంగా నిర్వహిస్తారు. కష్టానికి తగ్గ ఫలితం ఉంది. ఆదాయానికి తగ్గట్టు బడ్జెట్ రూపొందించుకుంటారు. మీ మాటతీరు ఆకట్టుకుంటుంది. ఆది, సోమ వారాల్లో పనులు అస్తవ్యస్తంగా సాగుతాయి. గృహం ప్రశాంతంగా ఉంటుంది. పరిచయాలు, వ్యాపకాలు పెంపొందుతాయి. అనవసర విషయాలకు దూరంగా ఉండాలి. బాధ్యతలు అప్పగించవద్దు. మీ నమ్మకం వమ్ము అయ్యే ఆస్కారం ఉంది. విలువైన వస్తువులు, వాహనం మరమ్మత్తుకు గురవుతాయి. ఆత్మీయుల ఆహ్వానం ఉత్సాహాన్నిస్తుంది. వేడుకలకు సన్నాహాలు సాగిస్తారు. ఆధ్యాత్మికత పట్ల ఆసక్తి కలుగుతుంది. పెద్దల ఆరోగ్యం సంతృప్తికరం. వృత్తుల వారికి సదవకాశాలు లభిస్తాయి. వ్యాపారాభివృద్ధికి పథకాలు రూపొందిస్తారు. ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి.  
 
మీనం: పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
ఖర్చులు అధికం. సంతృప్తికరం. ధనానికి ఇబ్బంది ఉండదు. అవిశ్రాంతంగా శ్రమిస్తారు. ఆందోళన అధికం. ఆలోచనలు పలు విధాలుగా ఉంటాయి. మంగళ, బుధ వారాల్లో పనులు సాగక విసుగు చెందుతారు. మీలో నైరాశ్యం చోటు చేసుకుంటుంది. ప్రియతముల రాకతో కుదుటపడుతారు. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. వేడుకలకు హాజరవుతారు. సంతానం కదలికలపై దృష్టి పెట్టండి. చెప్పుడు మాటలు పట్టించుకోవద్దు. ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుంటారు. ఒక సమాచారం ఉల్లాసాన్నిస్తుంది. వస్త్ర, ఫ్యాన్సీ వ్యాపారాలు ఊపందుకుంటాయి. కొనుగోలుదార్లను ఆకట్టుకుంటారు. ప్రింటింగ్ రంగాల వారికి ఆదాయాభివృద్ధి. వృత్తి ఉపాధి పథకాల్లో నిలదొక్కుకుంటారు. నిరుద్యోగుల కృషి ఫలిస్తుంది. వాహనం ఇతరులకివ్వడం క్షేమం కాదు. వీడియోలో చూడండి...