శుక్రవారం, 22 నవంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By రామన్
Last Modified: శనివారం, 10 నవంబరు 2018 (18:06 IST)

11-11-2018 నుంచి 17-11-2018 వరకూ మీ వార రాశి ఫలితాలు(Video)

కర్కాటకంలో రాహువు, తులలో రవి, వక్రి శుక్రుడు, వృశ్చికంలో బృహస్పతి, బుధులు, ధనస్సులో శని, మకరంలో కేతువు కుంభంలో కుజుడు. ధనస్సు, మకర, కుంభ మీనంలలో చంద్రుడు. 16వ తేదీన శుక్రుడు వక్రత్యాగం, రవి వృశ్చిక ప్రవేశం. 17న బుధుని వక్రమారంభం. 11న నాగులచవితి. 12న నాగపంచమి, గురు మౌడ్యమి ప్రారంభం.
 
మేషం: అశ్వని, భరణి, కృత్తిక 1వ పాదం
ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చులుంటాయి. పొదుపు మూలక ధనం గ్రహిస్తారు. శనివారం నాడు ప్రముఖుల సందర్శనం సాధ్యం కాదు. సంప్రదింపులు వాయిదా వేసుకుంటారు. మీ ఆలోచనల్లో మార్పు వస్తుంది. వివాహ యత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఒఖ సంబంధం ఆలోచింపచేస్తుంది. అనుభవజ్ఞుల సలహా పాటించండి. ఓర్పుతో వ్యవహరించాలి. ఒత్తిళ్లకు తలొంగవద్దు. తప్పటడుగు వేసే ఆస్కారం ఉంది. లౌక్యంగా పనులు చక్కబెట్టుకోవాలి. దంపతుల మధ్య దాపరికం తగదు. సంతానం అత్యుత్సాహం ఇబ్బంది కలిగిస్తుంది. వేడుకలు, దైవకార్యంలో పాల్గొంటారు. వ్యాపారాభివృద్ధికి మరింత శ్రమించాలి. కొనుగోలు దార్లతో జాగ్రత్త. వృత్తి ఉద్యోగస బాధ్యతల్లో మెళకువ వహించండి. మీ తప్పిదాలు సరిదిద్దుకోవడం ముఖ్యం. అధికారులకు ధనప్రలోభం తగదు. కోర్టు వాయిదాలు చికాకుపరుస్తాయి.  
 
వృషభం: కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2 పాదాలు
గృహంలో స్తబ్ధత తొలగుతుంది. పనులు చురుకుగా సాగుతాయి. వ్యవహార ఒప్పందాలకు అనుకూలం. తొందరపాటు నిర్ణయాలు తగవు. కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. అవకాశాలు కలిసివస్తాయి. ఖర్చులు సామాన్యం. స్థిరాస్తి కొనుగోలు దిశగా ఆలోచిస్తారు. ఆది, సోమ వారాల్లో శకునాలు పట్టించుకోవద్దు. ఆరోగ్యం సంతృప్తికరం. పెట్టుబడులకు అనుకూలం. ఉద్యోగ బాధ్యతల్లో మెళకువ వహించండి. అధికారులకు ధనప్రలోభం తగదు. నిరుద్యోగులకు ఉద్యోగయోగం. వ్యాపారాలు ఊపందుకుంటాయి. ఆటంకాలను దీటుగా ఎదుర్కుంటారు. సరుకు నిల్వలో జాగ్రత్త. కంప్యూటర్ రంగాల వారికి పురోభివృద్ధి. వలసమారాధనల్లో పాల్గొంటారు. మీ వాహనం ఇతరుల కివ్వడం క్షేమం కాదు. ప్రయాణం కలిసివస్తుంది. జూదాలు, బెట్టింగ్‌లకు దూరంగా ఉండాలి.    
 
మిథునం: మృగశిర 3, 4 పాదాలు, ఆర్థ్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
ఖర్చులు అధికం, ప్రయోనజనకరం. ఆత్మీయులకు సాయం అందిస్తారు. ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది. సభ్యత్వాల స్వీకరణకు అనుకూలం. బాధ్యతగా వ్యవహరించాలి. ప్రత్యర్తులతో జాగ్రత్త. ఎవరినీ అతిగా విశ్వసించవద్దు. ఒక వ్యవహారంలో మీ జోక్యం అనివార్యం. ఒకరికి సలహా ఇచ్చి మరొకరికి వ్యతిరేకులవుతారు. మంగళ, బుధ వారాల్లో అప్రమత్తంగా వ్యవహరించాలి. కావలసిన వ్యక్తుల కలయిక సాధ్యం కాదు. వ్యాపారాభివృద్ధికి పథకాలు రూపొందిస్తారు. చిరువ్యాపారులకు ఆశాజనకం. మార్కెట్ రంగాల వారికి మార్పులు అనుకూలిస్తాయి. ఉద్యోగస్తులకు ధనప్రలోభం తగదు. అధికారులకు హోదా మార్పు, స్థానచలనం. వృత్తి ఉపాధి పథకాల్లో నిలదొక్కుకుంటారు. ఆస్తి వివాదాలు పరిస్కార దిశగా సాగుతాయి. ఆధ్యాత్మిక, సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. 
 
కర్కాటకం: పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
ఆలోచనలు నిలకడగా ఉండవు. సంప్రదింపుల్లో ప్రతికూలతలు, గృహంలో చికాకులు అధికం. ధనమూలక సమస్యలెదుర్కుంటారు. సాయం ఆర్థించేందుకు మనస్కరించదు. అవసరాలు, చెల్లింపులు వాయిదా వేసుకుంటారు. ముఖ్యమైన పత్రాలు, నోటీసులు అందుతాయి ఆత్మీయుల రాక ఉపశమనం కలిగిస్తుంది. కొత్త వ్యాపకాలు సృష్టించుకుంటారు. ఆది, గురు వారాల్లో పనుల సానుకూలతకు అవిశ్రాంతంగా శ్రమిస్తారు. పెద్దల సాయంతో ఒక సమస్య సానుకూలమవుతుంది. మీ శ్రీ మతి వైఖరిలో మార్పు సంభవం. కుటుంబ విషయాల పట్ల శ్రద్ధ వహిస్తారు. ఆరోగ్యం ఫర్వాలేదనిపిస్తుంది. పర్మిట్ల రెన్యువల్‌లో మెళకువ వహించండి. బాధ్యతలు అప్పగించవద్దు. వృత్తి వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. ద్విచక్ర వాహనంపై దూరప్రయాణం తగదు.      
 
సింహం: మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
కొత్త పనులకు శ్రీకారం చుడతారు. అవకాశాలు కలిసివస్తాయి. ప్రముఖులతో సంప్రదింపులు జరుపుతారు. మీ అభిప్రాయాలకు స్పందన లభిస్తుంది. ధనలాభం ఉంది. కొన్ని ఇబ్బందుల నుండి బయటపడుతారు. ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. సంతానం విజయం ఉత్సాహాన్నిస్తుంది. మంగళ, శని వారాల్లో అప్రమత్తంగా ఉండాలి. ఇతరుల విషయాల్లో కలుగజేసుకోవద్దు. ప్రియతముల ఆరోగ్యం కుదుటపడుతుంది. వ్యాపారాల్లో లాభనష్టాలు సమీక్షించుకుంటారు. హోల్‌సేల్ వ్యాపారులు, స్టాకిస్టులకు ఆశాజనకం. వైద్య, న్యాయ, సాంకేతిక రంగాల వారికి పురోభివృద్ధి. ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. నిరుద్యోగులకు ఉపాధి శిక్షణావకాశం లభిస్తుంది. కళ, క్రీడాకారులకు ప్రోత్సాహకరం. దైవ, సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు.  
 
కన్య: ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
గృహం ప్రశాంతంగా ఉంటుంది. కొత్త వ్యాపకాలు సృష్టించుకుంటారు. అంచనాలు ఫలిస్తాయి. యత్నాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. రుణ విముక్తులవుతారు. సకాలంలో చెల్లింపులు జరుపుతారు. బంధుత్వాలు బలపడుతాయి. మీ సాయంతో శుభకార్యం నిశ్చయమవుతుంది. లౌక్యంగ పనులు చక్కబెట్టుకోవాలి. గురు, శుక్ర వారాల్లో భేషజాలకు పోవద్దు. సంతానం కదలికపై దృష్టి సారించండి. చెప్పుడు మాటలు పట్టించుకోవద్దు. ఉద్యోగస్తులకు పదోన్నతి, ధనలాభం. ప్రశంసలు, పురస్కారాలు అందుకుంటారు. వ్యాపారాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. నష్టాలు, ఆటంకాలను దీటుగా ఎదుర్కుంటారు. ప్రస్తుత వ్యాపారాలే శ్రేయస్కరం. ప్రింటింగ్ రంగాల వారికి ఒత్తిడి అధికం. తీర్థయాత్రలు సంతృప్తినిస్తాయి. వేడుకలు, వనసమారాధనల్లో పాల్గొంటారు.  
 
తుల: చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
సంప్రదింపులకు అనుకూలం. వివాహ యత్నాలు తీవ్రంగా సాగిస్తారు. పనులు సానుకూలమవుతాయి. వ్యవహార లాభం, కష్టానికి ప్రతిఫలం పొందుతారు. అంచనాలు ఫలిస్తాయి. శుభవార్త వింటారు. రోజువారి ఖర్చులే ఉంటాయి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. శనివారం నాడు ఎవరినీ అతిగా విశ్వసించవద్దు. మీ ఆలోచనల్లో మార్పు వస్తుంది. సముచిత నిర్ణయాలు తీసుకుంటారు. సంతానం దూకుడు అదుపు చేయండి. ప్రముఖులతో పరిచయాలు బలపడుతాయి. సభ్యత్వాలు, బాధ్యతలు స్వీకరిస్తారు. పెట్టుబడులపై దృష్టి పెడతారు. గృహంలో సందడి నెలకొంటుంది. వేడుకను ఆడంబరంగా చేస్తారు. ఉద్యోగ బాధ్యతల్లో మార్పులుంటాయి. అధికారులకు వీడ్కోలు పలుకుతారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. వృత్తుల వారికి ఆశాజనకం. క్రీడా పోటీల్లో రాణిస్తారు. పెట్టుబడులకు అనుకూలం.  
 
వృశ్చికం: విశాఖ 4వ పాదం, అనురాధ, జ్యేష్ట
ఈ వారం ఖర్చులు అధికం. చేతిలో ధనం నిలబడదు. అవిశ్రాంతంగా శ్రమిస్తారు. అవకాశాలు చేజారిపోతాయి. పట్టుదలతో యత్నాలు సాగించండి. సహాయం ఆశించవద్దు. పనులు అర్థాంతంగా ముగిస్తారు. ఆభరణాలు, పత్రాలు జాగ్రత్త. దంపతుల మధ్య సఖ్యత లోపం. మీ ఆవేశాన్ని అదుపులో ఉంచుకోండి. స్థిరాస్తి కొనుగోలు దిశగా ఆలోచిస్తారు. దళారులు, ప్రకటనలు విశ్వసించవద్దు. పదవులు, సభ్యత్వాల నుండి తప్పుకుంటారు. ఒక సమాచారం ఉత్సాహాన్నిస్తుంది. వనసమారాధనల్లో పాల్గొంటారు. వ్యాపారాభివృద్ధికి ప్రణాళికలు రూపొందిస్తారు. చిరువ్యాపారులకు సామాన్యం. ఉద్యోగస్తులకు ఏకాగ్రత ప్రధానం. కొత్త సమస్యలు ఎదురయ్యే సూచనలున్నాయి. నిరుద్యోగులకు ఉద్యోగయోగం. వైద్య, సాంకేతిక రంగాల వారికి ఆదాయాభివృద్ధి.  
 
ధనస్సు: మూల, పూర్వాషాడ, ఉత్తరాషాడ 1వ పాదం
లౌక్యంగా పనులు చక్కబెట్టుకోవాలి. మీ మాటే నెగ్గాలన్న పంతం తగదు. సహాయం ఆశించి భంగపడుతారు. ఆదాయ వ్యయాలకు పొంతన ఉండదు. పొదుపు ధనం గ్రహిస్తారు. చెల్లింపుల్లో జాగ్రత్త. వ్యవహారాల్లో ప్రతికూలతలెదురవుతాయి. పనులు ఒక పట్టాన పూర్తికావు. ఆప్తుల రాక ఉపశమనం కలిగిస్తుంది. కొత్త వ్యాపకాలు సృష్టించుకుంటారు. దంపతుల మధ్య దాపరికం తగదు. అయినవారి  వైఖరి బాధిస్తుంది. కొన్ని విషయాలు పట్టించుకోవద్దు. సంతానం భవిష్యత్తుపై శ్రద్ధ అవసరం. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. కొత్త పరిచయాలేర్పడుతాయి. ఒక సమాచారం ఆలోచింపచేస్తుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. వృత్తి ఉపాధి పథకాల్లో నిలదొక్కుకుంటారు. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి.  
 
మకరం: ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
దంపతుల ఆలోచనల్లో మార్పు వస్తుంది. సంప్రదింపులకు అనుకూలం. మీ ఇష్టాయిష్టాలను సున్నితంగా వ్యక్తం చేయండి. ఎవరినీ నొప్పించవద్దు. గృహమార్పు చక్కని ఫలితం ఇస్తుంది. శుభవార్త వింటారు. బాకీలు వసూలవుతాయి. పెట్టుబడుల పట్ల ఆకర్షితులవుతారు. ప్రైవేటు సంస్థల్లో మదుపు క్షేమం కాదు. ఆది, సోమ వారాల్లో పనులు హడావుడిగా సాగుతాయి. ఆకర్షణీయమైన పథకాలు రూపొందిస్తారు. వ్యాపార విస్తరణకు అనుకూలం. ఉద్యోగస్తులకు ఏకాగ్రత, సమయపాలన ప్రధానం. కొత్త అధికారులతో జాగ్రత్త. నిరుద్యోగులకు ఉపాధి శిక్షణ లభిస్తుంది. ప్రింటింగ్ రంగాల వారికి ఒత్తిడి అధికం. దైవదీక్షలు స్వీకరిస్తారు.  
 
కుంభం: ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
శుభకార్యం నిశ్చయమవుతుంది. వేదికలు అన్వేషిస్తారు. పర్మిట్లు, లైసెన్స్‌ల రెన్యువల్‌లో జాప్యం తగదు. ఆకస్మికంగా కొన్ని అవకాశాలు కలిసివస్తాయి. కాంట్రాక్టులు, ఏజెన్సీలు దక్కించుకుంటారు. ధనలాభం, ఆరోగ్యం సంతృప్తి, వాహనయోగం ఉన్నాయి. కొత్త పనులకు శ్రీకారం చుడతారు. ఆర్థికంగా ఫర్వాలేదనిపిస్తుంది. ఖర్చులు భారమనిపించవు. దైవ, సేవా సంస్థలకు సాయం అందిస్తారు. పరిచయాలు, బంధుత్వాలు బలపడుతాయి. మీ శ్రీమతి వైఖరిలో మార్పు సంభవం. మంగళ, బుధ వారాల్లో ఆరోగ్యం మందగిస్తుంది. అతిగా ఆలోచింపవద్దు. విశ్రాంతి అవసరం. వ్యాపారాల్లో రాణింపు, అనుభవం గడిస్తారు. సరుకు నిల్వలో జాగ్రత్త. వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకుంటారు. ఉద్యోగస్తులు అధికారులను ప్రసన్నం చేసుకుంటారు. వైద్య, న్యాయ రంగాల వారికి ఆదాయాభివృద్ధి. పుణ్యకార్యాలలో పాల్గొంటారు. 
 
మీనం: పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
గృహంలో మార్పుచేర్పులకు అనూకూలం. కొత్త పరిచయారలేర్పడుతాయి. వ్యవహారాలతో తీరిక ఉండదు. శ్రమ అధికం. పనులతో సతమతమవుతారు. ఆలోచనలు పలు విధాలుగా ఉంటాయి. ఖర్చులు విపరీతం. అవసరాలు, చెల్లింపులు వాయిదా వేసుకుంటారు. గురు, శుక్ర వారాల్లో ఊహించని సంఘటనలెదురవుతాయి. సోదరులతో సంప్రదింపులు జరుపుతారు. ఒక సమాచారం ఉపశమనం కలిగిస్తుంది. వససమారాధనలు, దైవకార్యాల్లో పాల్గొంటారు. వ్యాపారాల్లో లాభనష్టాలు సమీక్షించుకుంటారు. ప్రస్తుత వ్యాపారాలే శ్రేయస్కరం. ఉద్యోగ బాధ్యతల్లో మెళకువ వహించండి. యాదృచ్ఛికంగా తప్పులు దొర్లే ఆస్కారం ఉంది. నిరుద్యోగుల కృషి ఫలిస్తుంది. ప్రింటింగ్ రంగాల వారికి ఒత్తిడి, పనిభారం. ఆకస్మిక ప్రయాణం తలపెడతారు. ప్రేమ వ్యవహారాలు ఫలిస్తాయి. వీడియోలో చూడండి...