శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : గురువారం, 29 నవంబరు 2018 (16:44 IST)

మా డైరక్టర్ "2.O" సినిమా చూడనివ్వలేదు : హీరోయిన్ కళ్యాణి ప్రియదర్శిన్

జీనియస్ ఎస్. శంకర్ దర్శకత్వం వహించిన "2.O" చిత్రం గురువారం ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. ఈ చిత్రం విడుదలైన తొలి ఆటనే చూసేందుకు సినీ సెలెబ్రిటీలు ఉత్సాహం చూపిస్తున్నారు. ఇప్పటికే అనేక మంది సినీ ప్రముఖులు ఈ చిత్రాన్ని చూసి శభాష్ అంటూ మెచ్చుకుంటున్నారు. 
 
అలాగే ఈ చిత్రాన్ని చూడాలని ఉవ్విళ్లూరుతున్న వారిలో హీరోయిన్ కళ్యాణి ప్రియదర్శిన్ ఒకరు. ప్రస్తుతం ఈమె తిరుమల కిషోర్ దర్శకత్వంలో తెరకెక్కే చిత్రంలో నటిస్తోంది. ఈ చిత్రానికి చిత్రలహరి అనే టైటిల్‌ను ఖరారు చేయగా, ఇందులో సాయి ధరమ్ తేజ్ హీరో. అయితే, '2.O' మూవీని కళ్యాణి తొలిరోజే చూడాలని భావించింది. కానీ, దర్శకుడు నో చెప్పారట. దీంతో ఆమె తీవ్ర నిరాశకు లోనైంది. 
 
చూడనివ్వలేదని అంటున్నారు కథానాయిక కల్యాణి ప్రియదర్శన్‌. ప్రస్తుతం కల్యాణి తిరుమల కిశోర్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఓ చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమాకు ‘చిత్రలహరి’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. సాయి ధరమ్‌ తేజ్‌ కథానాయకుడిగా నటిస్తున్నారు. అయితే కల్యాణి ఈరోజు ‘2.ఓ’ చిత్రాన్ని చూడాలని అనుకున్నారట.
 
కానీ దర్శకుడు తిరుమల కిషోర్ అందుకు అనుమతి ఇవ్వలేదని తన ట్విట్టర్ ఖాతా ద్వారా వెల్లడించింది. 'డైరెక్టర్‌ గారు చిత్రీకరణను మధ్యలో నిలిపివేసి నన్ను '2.ఓ' సినిమాను చూడనివ్వడంలేదు. ఆ మ్యాజిక్‌ చూడాలని నాకెంతో ఆత్రుతగా ఉంది. మా సినిమా చిత్రీకరణ పూర్తవగానే తప్పకుండా "2.ఓ" చూస్తాను' అని పేర్కొంటూ సెట్స్‌లో తీసిన కిశోర్‌ ఫొటోను పంచుకున్నారు.
 
కాగా, సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని రూ.550 కోట్ల బడ్జెట్‌తో తీయగా, ఈ చిత్రం భారీ అంచనాల మధ్య విడుదలైంది. సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌, అమీజాక్సన్‌ ఇందులో జంటగా నటించారు. శంకర్‌ మ్యాజిక్‌ చూసేందుకు థియేటర్ల వద్ద అభిమానులు బారులుతీరారు.