గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By సెల్వి
Last Updated : శనివారం, 11 జులై 2020 (11:29 IST)

తెలంగాణలో కరోనా: 1,278 కొత్త కేసులు.. జీహెచ్ఎంసీలోనే అధికం

తెలంగాణలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. కానీ శుక్రవారం గుర్తించిన కేసులు అంతకుముందుతో పోల్చితే కాస్త తగ్గుముఖం పట్టాయి. శుక్రవారం మొత్తం 1,278 కరోనా కొత్త కేసులు నమోదైనట్లుగా హెల్త్ బులెటిన్‌లో పేర్కొన్నారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 32,224కు చేరుకుంది. ఇక ప్రస్తుతం రాష్ట్రంలో యాక్టివ్ కేసులు 12,680గా ఉన్నాయి.
 
గత 24 గంటల్లో 1013 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు. ఇప్పటి వరకూ పూర్తిగా కోలుకొని డిశ్చార్జి అయిన వారి సంఖ్య 19,205కు చేరింది. ఇక శుక్రవారం మరో 8 మంది కరోనాతో మృతి చెందగా, మొత్తం చనిపోయిన వారి సంఖ్య 339కి చేరింది.
 
శుక్రవారం నాడు గుర్తించిన కరోనా కేసుల్లో ఒక్క జీహెచ్ఎంసీ పరిధిలోనే అధికంగా 762 కొత్త కేసులు నమోదు కావడం విస్మయం కలిగిస్తోంది. ఆ తర్వాత కేసుల తాకిడి అత్యధికంగా రంగారెడ్డి జిల్లాలో ఉంది. అక్కడ 171 కొత్త కేసులు నమోదు కాగా, ఆ తర్వాత మేడ్చల్ జిల్లాలో 85 కొత్త కరోనా కేసులను గుర్తించారు.