శుక్రవారం, 22 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 11 జులై 2020 (10:11 IST)

వాట్సాప్ ద్వారా.. ఇక నోటీసులు, కోర్టు సమన్లు పంపవచ్చు.. సుప్రీం

సోషల్ మీడియాలో అగ్రగామి అయిన వాట్సాప్‌ను ప్రస్తుతం కరోనా కాలంలో అత్యవసర సేవలకు ఉపయోగిస్తున్నారు. ఇంకా కోవిడ్‌-19 ప్రబలిన నేపథ్యంలో సాంకేతిక పరిజ్ఞానాన్ని మరింత విస్తృతంగా ఉపయోగించాలని దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు నిర్ణయించింది. 
 
కోర్టు సమన్లు, నోటీసులను ఈ-మెయిళ్లు, ఫ్యాక్స్‌, వాట్సప్‌ వంటి సాధనాల ద్వారా పంపొచ్చని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎస్‌.ఎ.బోబ్డే, జస్టిస్‌ ఆర్‌.సుభాష్‌ రెడ్డి, జస్టిస్‌ ఎ.ఎస్‌.బోపన్నలతో కూడిన ధర్మాసనం పేర్కొంది.
 
అంతేగాకుండా.. కరోనా నేపథ్యంలో న్యాయవాదులు, కక్షిదారులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను పరిశీలించిన ధర్మాసనం ఈ అంశాన్ని సుమోటోగా విచారణకు స్వీకరించి తాజా నిర్ణయాన్ని వెల్లడించింది.