మంగళవారం, 26 నవంబరు 2024
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 28 మే 2020 (12:55 IST)

గుడ్ న్యూస్.. ఇక వాట్సాప్ నుంచి గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకోవచ్చు..!

సోషల్ మీడియాలో అగ్రగామి అయిన వాట్సాప్ సరికొత్త ఫీచర్లతో వినియోగదారులను ఆకట్టుకుంటోంది. ఇప్పటికే డార్క్ మోడ్ వంటి ఇతరత్రా ఫీచర్లను కస్టమర్లకు పరిచయం చేసిన వాట్సాప్ ప్రస్తుతం మరో గుడ్ న్యూస్ చెప్పింది.

అదేంటంటే..? దేశంలో రెండో అతిపెద్ద ఇంధన కంపెనీ భారత్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (బీపీసీఎల్‌) సాయంతో వాట్సాప్‌ నుంచి వంట గ్యాస్‌ సిలిండర్‌ను బుకింగ్‌ చేసుకునే అవకాశం కల్పించింది. 
 
బీపీసీఎల్‌ సంస్థకు 7.1 కోట్ల మంది ఎల్‌పీజీ వినియోగదారులు ఉన్నారు. కంపెనీ వెబ్‌సైట్‌లో రిజిస్టార్‌ చేసుకున్న మొబైల్‌ నంబర్‌ నుంచి వాట్సాప్‌ నంబర్‌ '1800224344' ద్వారా తమ సిలిండర్‌ను బుకింగ్‌ చేసుకోవచ్చునని వాట్సాప్‌తో పాటు బీపీసీఎల్ ఓ ప్రకటనలో వెల్లడించింది. 
 
కస్టమర్లకు సులభంగా సేవలందించేందుకు ఈ సదుపాయం కల్పించామని బీపీసీఎల్ కంపెనీ మార్కెటింగ్‌ డైరెక్టర్‌ అరుణ్‌ సింగ్‌ తెలిపారు. డెబిట్‌ లేదా క్రెడిట్‌ కార్డులు, యూపీఐ, అమేజాన్‌ ద్వారా చెల్లింపులు జరుపుకునే అవకాశం కూడా కల్పించినట్లు చెప్పారు.