శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 27 మే 2020 (22:36 IST)

శుభవార్త చెప్పిన గూగుల్.. వర్క్ ఫ్రమ్ ఉద్యోగులకు భారీ నజరానా!!

ప్రముఖ టెక్ సెర్చింజన్ గూగుల్ శుభవార్త చెప్పింది. కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న గూగుల్ కార్యాలయాలను మూసివేశారు. కానీ, వర్క్ ఫ్రమ్ హోం వెసులుబాటును కల్పించారు. అయితే, ఇపుడు పలు దేశాల్లో లాక్డౌన్ ఆంక్షలను సడలిస్తున్నారు. అలాగే, భారత్‍లోనూ ఆ ఆంక్షలు సడలించారు. దీంతో దశల వారీగా జనజీవనం కుదుటపడుతుంది. 
 
దీంతో టెక్ కంపెనీలు కూడా తమ ఆఫీసులను తెరిచి.. కార్యకలాపాలు కొనసాగించేందుకు ఆసక్తి చూపుతున్నాయి. ఇందులోభాగంగా, గూగుల్ కూడా జూలై నెల నుంచి తన కార్యాలయాలను తెరవాలని భావిస్తోంది. అదేసమయంలో లాక్డౌన్ సమయంలో వర్క్ ఫ్రమ్ హోం చేసిన ఉద్యోగులకు రూ.75 వేల అలవెన్సును ఇవ్వనుంది. 
 
గూగుల్ వర్గాల నుంచి వస్తున్న సమాచారం మేరకు.. జూలై నెల ఆరో తేదీన నుంచి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కార్యాలయాలను తెరవనుంది. ఈ ఆఫీసులకు తొలుత అసోసియేటెడ్ మేనేజర్లు రొటేషన్ పద్ధతిలో విధులకు హాజరుకానున్నారు. కాగా, ఫేస్‌బుక్ ట్విట్టర్ షోపిఫీలు ఇప్పటికే సింహభాగం ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోం సౌకర్యాన్ని కల్పించిన విషయం తెల్సిందే.