గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 22 మే 2020 (12:37 IST)

థియేటర్లలో పడనున్న బొమ్మ... రోజుకు 3 ఆటలే?

కరోనా కష్టాలు ప్రతి రంగాన్ని పట్టిపీడిస్తున్నాయి. ఇందులోభాగంగా సినిమా థియేటర్లు కూడా మూతపడ్డాయి. గత మార్చి నెలాఖరు నుంచి మూతపడిన ఈ థియేటర్లు ఇప్పట్లో తెరుచుకునే పరిస్థితి లేదు. ప్రస్తుతం నాలుగో దశ లాక్డౌన్ కొనసాగుతోంది. ఇది ఈ నెలాఖరు వరకు కొనసాగనుంది. అయితే, పలు అంశాల్లో లాక్డౌన్ ఆంక్షలను కేంద్రం సడలించింది. అయితే, మాల్స్, హోటల్స్(డైనింగ్), థియేటర్లను మాత్రం తెరుచుకునేందుకు కేంద్రం అనుమతి ఇవ్వలేదు. 
 
ఇకపోతే, కొన్ని అంశాల్లో లాక్డౌన్ ఆంక్షలు సడలింపులు ఇస్తుండటంతో థియేట‌ర్స్ కూడా త్వ‌ర‌లో ఓపెన్ అవుతాయ‌ని సినీ ప్రియులు ఆశాభావం వ్య‌క్తం చేస్తున్నారు. ఈ క్రమంలో ఈ నెల 21వ తేదీన మెగాస్టార్ చిరంజీవి నివాసంలో సినీ పెద్దలు సమావేశమయ్యారు. ఈ సమావేశానికి తెలంగాణ రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కూడా హాజరయ్యారు. 
 
ఇందులో సినిమా షూటింగ్స్‌తో పాటు థియేట‌ర్స్ రీఓపెన్ గురించి కీల‌క చ‌ర్చ‌లు జ‌రిపిన విష‌యం తెలిసిందే. సీఎం కేసీఆర్‌తో మాట్లాడి ఈ విష‌యాల‌పై త్వ‌ర‌లోనే క్లారిటీ ఇస్తాన‌ని త‌ల‌సాని సినీ ప్రముఖులకు హామీ ఇచ్చారు. తాజా స‌మాచారం ప్ర‌కారం ఆగస్టులో ఇటు తెలంగాణ అటు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో థియేట‌ర్స్ ఓపెన్ అవుతాయ‌నే టాక్ వినిపిస్తుంది. సింగిల్ స్క్రీన్‌లో ప్ర‌తి రోజు మూడు షోస్ ఉండేలా నిర్ణ‌యం తీసుకుంటార‌ని తెలుస్తుంది.