1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
  4. Varalakshmi Sarathkumar to marry her lover after lockdown ends?

క్రికెటర్‌ను పెళ్ళాడనున్న హీరో విశాల్ ప్రియురాలు?? (Video)

Varalakshmi Sarathkumar
ఇటు తెలుగు, అటు తమిళ చిత్రాల్లో నటిస్తూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్న నటి వరలక్ష్మి శరత్ కుమార్. ఈమె ఓ స్టార్ హీరో కుమార్తె. అయినప్పటికీ ఆమె తన పరపతిని ఎక్కడా ఉపయోగించుకోలేదు. పైగా, తన టాలెంట్‌తో సినీ అవకాశాలు రాబట్టుకుంటూ ముందుకుసాగిపోతోంది. అదేసమయంలో తమిళ హీరో విశాల్‌తో ప్రేమాయణం సాగించింది. ఒక దశలో వీరిద్దరూ వివాహం చేసుకోబోతున్నారనే పుకార్లు గుప్పుమన్నాయి. ఆ తర్వాత ఏం జరిగిందో ఏమోగానీ, విశాల్‌కు మరో అమ్మాయితో నిశ్చితార్థం జరిగింది. 
 
ఈ క్రమంలో వరలక్ష్మి శరత్ కుమార్... ఓ క్రికెటర్‌ను పెళ్లాడనుందనే ప్రచారం కోడంబాక్కం వర్గాల్లో హల్చల్ చేస్తోంది. పైగా, ఈ క్రికెటర్ టీమిండియా మాజీ కెప్టెన్, ప్రస్తుత కెప్టెన్ ధోనీ, విరాట్ కోహ్లీలకు అత్యంత సన్నిహితుడట. పైగా, లాక్డౌన్ ముగిసిన వెంటనే ఈ వివాహం జరుగనుందట. 
 
అంతేకాకుండా, ఆ క్రికెటర్‌కు శరత్ కుమార్ ఫ్యామిలీకి, అతని ఫ్యామిలీకి సన్నిహిత సంబంధాలు ఉన్నాయని, వీరిద్దరి వివాహానికి రెండు కుటుంబాల నుంచి గ్రీన్ సిగ్నల్ కూడా వచ్చేసిందన్న ఓ వార్త వైరల్ అవుతోంది. త్వరలోనే పెళ్లికి ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయని తమిళ సినీ వర్గాలు అంటున్నాయి.
 
తమిళ సినీ పరిశ్రమలో సెలబ్రిటీలు క్రికెటర్లను పెళ్లాడటం ఇదే తొలిసారేమీ కాదు. గతంలో నటి రాధిక కుమార్తె క్రికెటర్ అభిమన్యు మిథున్‌తో ప్రేమలో పడగా, ఇరు కుటుంబాల పెద్దలూ పెళ్లికి అంగీకరించిన సంగతి తెలిసిందే. ఇక తాజాగా వస్తున్న ఈ వార్తలపై వరలక్ష్మీ శరత్ కుమార్ ఎలా స్పందిస్తారో చూడాలి. ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం ఏమిటంటే.. రాధిక - శరత్ కుమార్‌లు ఇపుడు భార్యాభర్తలు ఉన్నారు. 
 
About Writer
ఠాగూర్
తర్వాతి కథనం
ఎన్టీఆర్‌తో కేజీఎఫ్ డైరెక్టర్ సినిమా, పారితోషికం తెలిస్తే షాకే