నాకు పెళ్లి చేసుకోవాలనిపిస్తే.. మా ఇంటి పైకెక్కి గట్టిగా అరుస్తా..?

varalakshmi Sarathkumar
varalakshmi Sarathkumar
సెల్వి| Last Updated: బుధవారం, 20 మే 2020 (10:12 IST)
పందెంకోడి 2లో విలన్ పాత్రధారిగా అదరగొట్టివ వరలక్ష్మి శరత్ కుమార్‌పై వస్తున్న పెళ్లి పుకార్లపై ఆమె స్పందించారు. సీనియర్ నటుడు శరత్ కుమార్ తనయ అయిన వరలక్ష్మి కోలీవుడ్‌లో హీరోయిన్‌గా అరంగేట్రం చేసినప్పటికీ విలక్షణ పాత్రలను ఎంచుకుని.. తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంది. ఆపై విశాల్‌తో ప్రేమాయణం సాగిందనే వార్తలు వచ్చాయి.

ప్రస్తుతం క్రికెటర్‌తో ప్రేమాయణం నడుపుతున్నట్లు కోలీవుడ్‌లో టాక్ వస్తోంది. ప్రేమాయణం కాస్త వివాహం వరకు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయని కోలీవుడ్ కోడై కూసింది. అయితే ఈ వార్తలపై వరలక్ష్మీ శరత్ కుమార్ స్పందించింది. తన ట్విట్టర్ ద్వారా వరలక్ష్మీ శరత్ కుమార్ స్పందిస్తూ.. తన వివాహం గురించి తనకే ఇప్పుడే తెలిసింది. ఇవన్నీ అర్థం లేని పుకార్లు అంటూ కొట్టిపారేసింది.

అందరూ తనకు పెళ్లి జరగాలని ఎందుకు అంతగా కోరుకుంటున్నారు. ఒకవేళ తాను పెళ్లి చేసుకోవాలని అనుకుంటే.. మా ఇంటి పైకెక్కి గట్టిగా అరుస్తా.. అప్పుడు మీడియా అందరూ దాని గురించి రాసుకోవచ్చునని చెప్పుకొచ్చారు. తాను ఇప్పట్లో పెళ్లి చేసుకోనని.. అలాగని నటనకు దూరం కానని వరలక్ష్మి శరత్ కుమార్ స్పష్టం చేసింది.దీనిపై మరింత చదవండి :