సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 19 మే 2020 (16:00 IST)

ఆర్థిక కష్టాల్లో విశ్వనటుడు గారాలపట్టి? (video)

భారతీయ చలనచిత్ర పరిశ్రమలో విశ్వనటుడుగా పేరొందిన కమల్ హాసన్ ముద్దుల గారాలపట్టి, హీరోయిన్ శృతిహాసన్‌ ఇపుడు ఆర్థిక కష్టాల్లో చిక్కుకునట్టు పుకార్లు గుప్పుమంటున్నాయి. ప్రస్తుతం ఆమె ముంబైలో ఒంటరిగా నివసిస్తోంది. పైగా, గత కొంతకాలంగా ఆమెకు సరైన సినిమాలు లేవు.

సినీ కెరీర్ పీక్ స్టేజ్‌లో ఉన్న సమయంలో ఓ విదేశీయుడితో ప్రేమలోపడి, డేటింగ్ కూడా చేసింది. ఈ ప్రేమ పెళ్లి వరకు వచ్చి.. పెటాకులైంది. ఆ తర్వాత కొంతకాలం డిప్రెషన్‌లోకి వెళ్లిన శృతిహాసన్.. మెల్లగా తేరుకుని, తిరిగి సినీ కెరీర్‌పై దృష్టిసారించింది. ఈ పరిస్థితుల్లో ఆమె ఆర్థికంగా తీవ్ర ఒడిదుడుకులను ఎదుర్కొంటున్నట్టు కోలీవుడ్ ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం. 
 
నిజానికి ఒకపుడు తెలుగు, త‌మిళం, హిందీ భాష‌ల‌లో శృతిహాసన్ బాగా అలరించింది. డబ్బులు కూడా బాగా సంపాదించింది. కానీ, ఇపుడు ఆర్థిక కష్టాల్లో చిక్కుకుంది. ఇదే అంశంపై ఆమె సన్నిహితులను కదిలించగా, కొన్నాళ్లు సినిమాల‌కి దూరంగా ఉండ‌డంతో పాటు ప్ర‌స్తుతం లాక్డౌన్ వ‌ల‌న ఆర్థిక లావాదేవీలేవి జ‌ర‌గ‌క‌పోవ‌డంతో శృతికి ఆర్థిక స‌మ‌స్య‌లు తలెత్తాయ‌ని చెబుతున్నారు. 
 
త‌న తండ్రిని అడిగితే ఇస్తారు కాని, అలా అడ‌గ‌డం ఇష్టం లేద‌ని శృతి చెబుతుంద‌ట. ఎవరిపైన‌ ఆధారపడి బతకకూడదన్నది తన అభిమతం కాదని చెప్పింది. కాగా, ప్రస్తుతం ఈ అమ్మడు హీరో రవితేజ నటిస్తున్న క్రాక్ మూవీలోనూ, ఓ వెబ్ సిరీస్‌లో కూడా నటిస్తోంది.

ప‌వ‌న్ సినిమాలోను శృతి క‌థానాయిక‌గా ఎంపికైందని వార్త‌లు వస్తున్నా, వీటిపై క్లారిటీ రావాల్సివుంది. ఈ ప్రాజెక్టులు పూర్తయితేగానీ ఈ అమ్మడు ఆర్థికంగా నిలదొక్కుకోలేదు.