శుక్రవారం, 10 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 5 మే 2020 (13:11 IST)

విభేదాలతో కలిసి జీవించే కంటే విడిపోవడం మంచిది : శృతి హాసన్

టాలీవుడ్ నటి శృతి హాసన్ కీలక వ్యాఖ్యలు చేశారు. మా అమ్మానాన్నలు విడిపోయి మంచిపని చేశారనీ, ఇది తనకు సంతోషం కలిగించే అంశమని శృతి హాసన్ తెలిపారు. తాజాగా ఆమె మాట్లాడుతూ, అభిప్రాయభేదాలు వచ్చినప్పుడు కలిసి ఉండడం కంటే విడిపోవడమే మంచిదని‌ తెలిపారు. 
 
విభేదాలతో కలిసి జీవించే కంటే విడిపోవడం మంచిదని, ఉదాహరణకు తన పేరెంట్స్‌‌ విషయాన్ని ప్రస్తావించింది. తన అమ్మ, నాన్న విడిపోవడం సంతోషకరమైన విషయమేనని వ్యాఖ్యానించింది. ఎందుకంటే తన పేరెంట్స్‌ ఇద్దరూ కళాకారులేనని, వారు పరస్పరం గొడవ పడుతూ మనశ్శాంతి లేకుండా జీవించడం కంటే విడిపోవడమే మంచిదని తెలిపింది.
 
అలా వారి జీవితాలను సంతోషంగా గడపడమే ఉత్తమమని తెలిపింది. వారిద్దరూ విడిపోవడం కష్టంగా ఉన్నప్పటికీ వారు కలిసి జీవించినప్పుడు పలు సమస్యలు వచ్చేవని ఆమె తెలిపింది. తాను వాటిని ప్రత్యక్షంగా చూశానని చెప్పింది. తాను మొదట్లో తన తల్లిదండ్రులను కలపాలని అనుకున్నానని తెలిపింది.
 
అయితే, వారు మళ్లీ కలిస్తే ఒకరిపై ఒకరు గొడవలు పడి మనశ్శాంతికి దూరం అవుతారని తనకు అనిపించిందని చెప్పింది. అందుకే తాను ఇక ఆ ప్రయత్నం చేయలేదన్నారు. ప్రస్తుతం వారిద్దరు మనశ్శాంతిగా ఉండగలుగుతున్నారని చెప్పింది.