గురువారం, 20 జూన్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 10 మే 2020 (12:03 IST)

చర్చలు - బేరాలు ఉండవు.. ఒకే రేటు : శృతిహాసన్

తనది ఒకే రేటు అని.. చర్చలు, బేరాలంటూ ఏవీ ఉండవని విశ్వనటుడు కమల్ హాసన్ ముద్దులు కుమార్తె, టాలీవుడ్ హీరోయిన్ శృతిహాసన్ అంటోంది. కరోనా లాక్‌డౌన్ కారణంగా ఆమె ప్రస్తుతం ముంబైలో ఒంటరిగా నివశిస్తోంది. 
 
తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, ప్రస్తుతం తాను ముంబైలో ఒంటరిగా నివసిస్తున్నట్టు చెప్పారు. మా నాన్న కమల్ హాసన్, చెల్లి అక్షర హాసన్‌లు చెన్నైలో ఉంటున్నారని చెప్పారు. 
 
తాను లాక్‌డౌన్ సమయంలో ఎంతో ఎంజాయ్ చేస్తున్నట్టు చెప్పకొచ్చింది. తనకు ఇష్టమైన ఆహారాన్ని ఆరగిస్తూ, సోషల్ మీడియా ద్వారా కొత్త వారితో స్నేహం చేస్తున్నట్టు చెప్పింది. అంతేకాకుండా, కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు ప్రతి ఒక్కరూ వ్యక్తిగత శుభ్రతను పాటించాలని ఆమె కోరారు. 
 
అదేసమయంలో లాక్‌డౌన్ సమయంలో మందకొడిగా ఉండకుండా యాక్టివ్‌గా ఉంటూ, ఇంటితో పాటు పరిసరాలను శుభ్రం చేసుకోవాలని శృతిహాసన్ పిలుపునిచ్చింది.